ETV Bharat / Irctc Latest Tour Packages

Irctc Latest Tour Packages

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల భక్తులు భారీగా కేరళకు వెళ్తారు. అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. ఐదురోజుల పాటు కొనసాగే యాత్రను అయ్యప్ప భక్తుల కోసం ఐఆర్​సీటీసీతో కలిసి దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. శబరిమల యాత్ర పేరుతో రైల్వే నూతన పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి..? ప్యాకేజీ ధర ఎంత ఉంటుంది..? తదితర వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తున్న భారత్ గౌరవ్ రైళ్లకు అనూహ్య స్పందన వస్తుంది. ప్రతీ సీజన్​లో భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టూరిజం ప్యాకేజీలతో భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లలో బోర్డింగ్, డీ.బోర్డింగ్ స్టేషన్లతో తెలంగాణ రాష్ట్రం నుంచి దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది. ఐఆర్​సీటీసీ శబరిమల యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బ్రోచర్​ను ఇవాళ విడుదల చేసింది. రైల్వే ప్రయాణికులు శబరిమల ఆలయం, ఇతర అనుసంధానిత యాత్రా స్థలాలను సందర్శించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.

లేటెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.