ETV Bharat / Free Gas Cylinder In Ap

Free Gas Cylinder In Ap

ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుకను ప్రకటించారు. సూపర్ సిక్స్​లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టనుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించనుంది. ఏడాదికి రూ.2 వేల 684 రూపాయల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దీపం పథకం గొప్ప ముందడుగని సీఎం అభివర్ణించారు.

రాష్ట్రంలో 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే సుమారు 1.47 కోట్ల కుటుంబాలు ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. వీరందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ. 3,640 కోట్లు ఖర్చవుతుంది. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేయనున్నారు.

లేటెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.