ETV Bharat / politics

మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - బరిలో బీఆర్‌ఎస్‌ దిగుతుందా? - BRS IN TG GRADUATE MLC ELECTIONS

ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీపై బీఆర్‌ఎస్‌ నిర్ణయం - బరిలో దిగుతుందా? లేదా అనే విషయంపై ఉత్కంఠ

Will BRS Contest in Telangana Graduate MLC Elections
Will BRS Contest in Telangana Graduate MLC Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 11:29 AM IST

Will BRS Contest in Telangana Graduate MLC Elections? : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో భారత రాష్ట్ర సమితి బరిలో దిగుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఆదిలాబాద్‌-నిజామాబాద్- కరీంనగర్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికలో పార్టీ అభ్యర్థిని నిలపని గులాబీ పార్టీ ఈ సారి ఏం చేస్తుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. కొందరు ఆశవహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

మార్చి నెలలో ఎన్నికలు? : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కాగా ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం ఉంది. ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి కూడా పదవీ విరమణ చేసే వారిలో ఉన్నారు.

మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు - డైలామాలో బీఆర్ఎస్! (ETV Bharat)

ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘోత్తమ్ రెడ్డి, వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నర్సిరెడ్డి పదవీ విరమణ చేసే వారిలో ఉన్నారు. దీంతో ఆ స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించనుంది. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా ఈసీ ప్రకటించింది. 2024 నవంబర్ ఒకటో తేదీ ప్రామాణికంగా డినోవా ఓటర్ల జాబితాను ఎన్నిక కోసం సిద్ధం చేసింది. ఓటర్ల జాబితా కూడా సిద్ధమైన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరిస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

గులాబీ పార్టీ ఏం చేస్తుంది : ఎన్నిక సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్రంలో హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరగుతుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏం చేస్తుందన్నది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలను పక్కన పెడితే ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో గులాబీ పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2019లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపలేదు. స్వతంత్రంగా పోటీ చేసిన చంద్రశేఖర్‌ గౌడ్‌కు చివరి నిమిషంలో అనధికారిక మద్ధతు పలికింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. మరి ఈ దఫా ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరిన నేతలు : పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ కోసం ఆశావహులు ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్టీఎస్ మాజీ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత రాజారాం యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన చంటి రాహుల్, తదితరుల పేర్లు ప్రచారంలో వినిపించాయి. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేయించారు. పార్టీ నేతలను కలిసి తమ ప్రయత్నాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా కలిసి తమ ఆసక్తిని చెప్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అధినేత తన పట్ల సుముఖంగా ఉన్నారని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. ఇతర నేతలను కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్ధతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2018 శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో అప్పటి ప్రతిపక్షానికి పట్టభద్రులు మద్ధతు ఇచ్చారని, ఇపుడు కూడా అదే తరహాలో ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం : పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఎన్నికలను ఉపయోగించుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.