Jasprit Bumrah Champions Trophy 2025 : ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ బౌలర్ హర్షిత్ రాణాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటన చివరిలో వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డ బుమ్రా, అప్పట్నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో బుమ్రా ఆడి ఫిట్‌నెస్‌ను చాటుకునే ప్రయత్నం చేస్తాడనుకున్నా అది జరగలేదు. అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ-NCAకి పరిమితమవడం వల్ల బుమ్రా ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో బుమ్రాను పక్కన పెట్టి యంగ్ క్రికెటర్ హర్షిత్ రాణాకు జట్టులో స్థానం కల్పించారు. మరోవైపు యశస్వి జైస్వాల్‌కి తుది జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు. ఇక టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
'బుమ్రా లేకపోతే కష్టమే!- ఛాంపియన్స్ ట్రోఫికి టీమ్ఇండియా బాగా వీక్ అయిపోతుంది!'
Akash Chopra On Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే, టీమ్ ఇండియానే గ్రూప్ ఏలో అత్యంత బలహీనమైన పేస్ అటాక్‌ను కలిగి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో టీమ్ఇండియా పేసర్లు ఎవరూ తమ అత్యుత్తమ ఫామ్ కనబరచలేదని తెలిపాడు. ఇది ఐసీసీ టోర్నమెంట్లో జట్టును ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
"గాయం నుంచి కోలుకున్న తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో మహ్మద్ షమీ ఇంకా అత్యుత్తమ పెర్ఫామెన్స్ చేయలేదు. రీఎంట్రీ తర్వాత షమీ టాప్ గేర్‌ను అందుకోలేదు. అతని స్పీడ్ తగ్గింది. స్పీడ్ అనేది ఒక్కొ బౌలర్‌కు ఒక్కొలా పనిచేస్తుంది. భువనేశ్వర్ కుమార్ గంటకు 132 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. షమీ అదే వేగంతో వేస్తే కుదరదు. షమీ గంటకు 137-138 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి." అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
'అందువల్లే కోహ్లీ త్వరగా ఔట్'- ఇంగ్లాండ్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ ఫైర్
మరో మైల్స్టోన్కు దగ్గరలో రోహిత్- ఒకే దెబ్బతో నలుగురి రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్!