ETV Bharat / offbeat

నిగనిగలాడే "వాటర్​ యాపిల్"​ - ఇంట్లోనే పెంచుకోండిలా!- ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! - HOW TO GROW WATER APPLES AT HOME

-ఆరోగ్యానికి మేలు చేసే వాటర్​ రోజ్​ యాపిల్​ -ఈ టిప్స్​ పాటిస్తే ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు!

How to Grow Water Apples at Home
How to Grow Water Apples at Home (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 12:01 PM IST

How to Grow Water Apples at Home: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ఫస్ట్​ ప్లేస్​లో ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక పండ్లు అనగానే యాపిల్​, దానిమ్మ, అరటి, బొప్పాయి, నారింజ అంటూ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ మనకు పేర్లు కూడా తెలియని పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో వాటర్ యాపిల్ ఒకటి. ఈ పండును అందరూ చూసే ఉంటారు కానీ దాని పేరు మాత్రం తెలియకపోవచ్చు. నిగనిగలాడుతూ దోరగా నోరూరించే వాటర్‌ యాపిల్‌, రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగానూ మేలు చేస్తుంది. అయితే బయట మార్కెట్లో లభించే ఈ పండును ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మరి, దీన్ని ఎలా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాటర్‌ యాపిల్‌నే రోజ్‌ యాపిల్, చంబక్క, జంబు, పానీసేబ్, మలబార్‌ ప్లమ్‌ అంటూ ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారతదేశంలోని కొన్ని ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరుగుతాయి. దీని శాస్త్రీయనామం సీజీజీయం ఆక్వియమ్‌.

నీటి శాతం ఎక్కువే: ఈ మొక్కకు మార్చి నుంచి ఆగస్టు వరకూ కాయలు కాస్తాయి. ఈ పండ్లు మొదట ఆకుపచ్చగా ఉండి పక్వానికి వచ్చే కొద్దీ గులాబీ రంగులోకి మారతాయి. ఇవి లోపల తెల్లగా ఉంటాయి. దీనిలో నీటిశాతం ఎక్కువ. ఔషధ గుణాలూ అధికమే. సులువుగా పెరిగే లక్షణం ఉండటం వల్ల దీన్ని ఇంటి తోటల్లో బాగా పెంచుకుంటారు. సాధారణంగా ఇది నేలలో ఎత్తుగా, బలంగా పెరుగుతుంది. అయితే, ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.

ఎలా పెంచుకోవాలంటే: సారవంతమైన నేల, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాటర్‌ యాపిల్‌ చక్కగా ఎదుగుతుంది.

  • ఈ మొక్కను కుండీలో నాటేందుకు ముందుగా కాస్త వెడల్పుగా ఉండే కుండీని ఎంచుకుని దానికి రంధ్రాలు చేసి ఉంచుకోవాలి.
  • ఇప్పుడు అందులో సారవంతమైన మట్టిని పోసుకోవాలి. ఆ తర్వాత మొక్కను నాటుకోవాలి. అయితే మొక్కకు కనీసం ఆరేడు గంటలైనా ప్రత్యక్ష సూర్యకాంతి అందేలా చూసుకోవాలి. ఈ మొక్క ఒక్కసారి నిలదొక్కుకున్నాక కరవు నేలల్లోనూ చక్కగా పెరుగుతుంది.
  • మొక్క పెరుగుతున్నప్పుడు ఎండిన కొమ్మలు లేదా ఎక్కువగా పెరిగిన వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే సరి.
  • ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆర్గానిక్‌ కంపోస్ట్‌ని, సమతుల పోషకాల్ని అందించాలి.
  • నీళ్లు ఎక్కువైతే వేర్లు కుళ్లిపోతాయి. కాబట్టి మొక్కలకు నీరు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
  • చీడపీడల నివారణకు సర్ఫ్‌ వాటర్‌ స్ప్రే, వేప నూనె పిచికారీ వంటివి చేయాలి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ఎంతో ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు.

పూల కుండీలో నారింజ పండ్లు - ఇంట్లోనే పెంచండిలా!

పోషకాల "ఉల్లికాడలు" ఇంట్లో పెంచాలనుకుంటున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​ రిజల్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.