Horoscope Today February 16th 2025 : 2025 ఫిబ్రవరి 16వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సంతోషకరంగా గడిచిపోతుంది. మీరు వేసే అడుగు సత్ఫలితాలనిస్తుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో పేరొందిన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభ ఫలితాలనిస్తుంది.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలోని సమస్యలు తగ్గుతాయి. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు ఇబ్బంది పెడతాయి. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో తీవ్రమైన జాప్యం చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలించవు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందదు. ఆర్ధిక కష్టాలు చుట్టు ముడతాయి. నిరాశ వీడి ఉత్సాహంతో పనిచేస్తే కార్యజయం ఉంటుంది. తీర్థయాత్రలు మనశ్శాంతి కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరుని ఆలయ సందర్శనం శుభకరం.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన శుభవార్తలు వింటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేయండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. వృథా ఖర్చులు నివారిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి పరంగా విశేషమైన ఆర్థిక లాభాలను అందుకుంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతుల సూచన ఉంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో సమయం గడపటం మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

తుల (Libra) : తులరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అర్థం లేని మొండితనం, ఉద్రేకపడే స్వభావం కారణంగా ఈ రోజంతా సమస్యాత్మకంగా మారుతుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు దూకుడు తగ్గించుకుంటే మంచిది. అహంకారాన్ని వీడి అందరినీ కలుపుకొని పోతే సమస్యలు ఉండవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇంట్లో సంతోషం, ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉండడం వల్ల ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. విదేశీయుల సాంగత్యంలో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఈ రోజు అన్నింటా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రత్యర్ధులు ఓటమి పాలవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ శివపంచాక్షరీ మంత్రం జపం మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం వ్యతిరేకంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు, గొడవలు జరగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని గొడవలు, వాదనలు చేయకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతనోత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. రచయితలకు, కళాకారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. దుర్గాస్తుతి పారాయణతో ప్రశాంతత కలుగుతుంది.