ETV Bharat / sports

12వేల మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ, 9 ఛార్టడ్ ఫ్లైట్స్​ - ఛాంపియ్స్​ ట్రోఫీ కోసం PCB స్పెషల్​ అరేంజ్​మెంట్స్! - ICC CHAMPIONS TROPHY 2025

ఛాంపియ్స్​ ట్రోఫీ కోసం PCB స్పెషల్​ అరేంజ్​మెంట్స్ - ఆ అపవాదును తొలగించేందుకే!

ICC Champions Trophy 2025 PCB
ICC Champions Trophy 2025 PCB (IANS Photo AND AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 19, 2025, 3:24 PM IST

ICC Champions Trophy 2025 : పాకిస్థాన్‌ వేదికగా సుమారు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియ్స్​ ట్రోఫీ జరగనుంది. 1996 వన్డే ప్రపంచ కప్‌నకు చివరిసారిగా పాక్‌ హోస్ట్‌గా వ్యవహరించింది. ఇప్పుడు మళ్లీ ఈ సారి ఆతిథ్యం ఇస్తోంది. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ​ఈ ట్రోఫీ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. సెక్యూరిటీకి సంబంధించి తమపై ఉన్న అపవాదును తొలగించేందుకు పీసీబీ నడుం బిగించినట్లు అక్కడి మీడియా తాజాగా వెల్లడించింది.

12వేల మంది పోలీసుల పహారా!
మరోవైపు లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరగనున్న మ్యాచ్‌ల కోసం సుమారు 12వేల మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. ఇందులో 18 మంది సీనియర్‌ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, అలాగే 1200 మంది సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లు ఉన్నారట.

వారితో పాటు 200 మంది వరకు మహిళా పోలీసులను కూడా కేటాయించారు. లాహోర్‌లో గ్రూప్‌ స్టేజ్‌లో ఫిబ్రవరి 22, 26, 28న మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 5న రెండో సెమీస్‌కు లాహోర్ వేదిక. ఇక్కడే దాదాపు 8వేలకు పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించినట్లు పలు వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, రావల్పిండిలో మరో నాలుగు వేల మందికి పైగా పోలీసులను మోహరించనుంది పీసీబీ. తొలి మ్యాచ్‌కు వేదికైన కరాచీలోనూ పెద్దఎత్తున సెక్యూరిటీని పీసీబీ పెట్టింది. ఇక్కడా గ్రూప్‌ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.

ఫ్యాన్స్‌ కోసం స్పెషల్​ అరేంజ్​మెంట్స్
ఓ వైపు మైదానాల్లో భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాక్‌ క్రికెట్ బోర్డు, మరోవైపు టీమ్స్​, ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ (PAI) ఆధ్వర్యంలో 9 ప్రత్యేకమైన చార్టర్డ్‌ ఫ్లైట్లను కూడా కేటాయించింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్‌ మధ్య ఈ ప్రయాణాలు జరగనున్నాయని తెలుస్తోంది.

ఇక కరాచీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్- న్యూజిలాండ్​ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన పాక్‌ బౌలింగ్ ఎంచుకుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

ఛాంపియన్స్‌ ట్రోఫీ టీమ్ఇండియా హైలైట్స్- మూడో టైటిల్​పై రోహిత్ సేన గురి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.