Fine for wasting Drinking water : హైదరాబాద్లో తాగునీటిని ఇతర అవసరాలకు జలమండలి నీటిని ఉపయోగిస్తే చర్యలు చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు నగరంలో అక్కడి జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే జరిమానా విధిస్తుంది. అదే తరహాలో ఇక్కడ అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. హైదరాబాద్ మహా నగరంలో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. ఒక నెలలోనే నగరంలో అర మీటరు నుంచి మీటరు దాకా జల మట్టాలు పడిపోవడం రానున్న వేసవికి ప్రమాద సూచికగా నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్లో భారీగా నీటి వృథా : జలమండలి పరిధిలో 13.7లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 550 ఎంజీడీల నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. వెయ్యి లీటర్ల (ఒక కిలోలీటరు) నీటి సరఫరాకు రూ.48 వ్యయం అవుతంది. కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని దుర్వినియోగం చేస్తున్నారని జలమండలి గుర్తించింది. వాహనాలను శుభ్రం, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఈ నీటిని వాడుతున్నట్లు తెలిసింది. ఉచిత నీటి పథకంతో నీటి దుర్వినియోగం మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు. నగరంలో భూగర్భజలాలు పడిపోతున్న తరుణంలో పొదుపు పాటిస్తేనే వేసవి నుంచి బయటపడవచ్చని సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
బెంగళూరులో రూ.5వేలు జరిమానా : బెంగళూరులో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే జరిమానా విధించనున్నట్లు అక్కడి జలమండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటిని వాహనాలను కడగడం, గార్డెనింగ్, నిర్మాణాలకు, వినోద కార్యక్రమాలకు వినియోగించడం పూర్తి నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే తొలిసారి గుర్తిస్తే రూ.5వేలు జరిమానా తర్వాత కూడా వృథా చేస్తుంటే రోజుకు అదనంగా రూ.500 చొప్పున జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
మన చట్టంలోనూ ఉన్నా : మహానగర జలమండలిలో తాగునీటిని వృథా చేస్తే జరిమానా విధించేలా చట్టం ఉంది. తొలిసారి దుర్వినియోగం చేస్తే రూ.200, అప్పటికీ ఆపకుంటే రోజుకు అదనంగా రూ.20 జరిమానా విధించేలా జలమండలి చట్టంలో ఉంది. ఇది దశాబ్దాల క్రితం నిర్ణయించిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే పక్కాగా ఫిర్యాదులు ఉంటేనే చర్యలకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
గృహావసరాల పేరుతో కమర్షియల్గా అమ్ముకుంటున్నారు!
తినడానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? - పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడి!