ETV Bharat / bharat

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ - SONIA GANDHI HOSPITALISED

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi Hospitalised
Sonia Gandhi Hospitalised (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 7:10 AM IST

Sonia Gandhi Hospitalised : కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె గురువారం ఉదయం దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్‌ గంగారాం ఆసుపత్రి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ సమీరన్‌ నందీ రాజ్యసభ సభ్యురాలి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. గతేడాది సెప్టెంబర్‌లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.