ETV Bharat / offbeat

IRCTC కర్ణాటక టూర్​ - ఆరు రోజుల పాటు ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు! - పైగా ధర తక్కువ! - IRCTC KARNATAKA TOUR

-కర్ణాటక అందాలు చూసేందుకు ఐఆర్​సీటీసీ ఆరు రోజుల టూర్​ -తక్కువ ధరకే హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ

IRCTC Karnataka Tour
IRCTC Karnataka Tour (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 10:23 AM IST

IRCTC Karnataka Tour: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు విజిట్​ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్​ చేస్తుంటారు. మరి మీరు కూడా పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ ఓ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరకే కర్ణాటకలోని పలు ప్రదేశాలను చూసేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. మరి ఈ టూర్​ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు "డివైన్ కర్ణాటక" పేరుతో IRCTC టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తోంది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు,​ 6 పగళ్లు కొనసాగునుంది. కర్ణాటకలోని గోకర్ణ, మురుడేశ్వర్​, ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య సహా పలు ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే,

  • మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ఫ్లైట్​(6E 7549) జర్నీ స్టార్ట్​ అవుతుంది. మార్నింగ్​ 8 గంటలకు మంగుళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తి చేసుకుని హోటల్​కు చేరుకుంటారు. బ్రేక్​ఫాస్ట్​ అనంతరం మంగళ దేవి, కద్రి మంజునాథ దేవాలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రం సందర్శిస్తారు. ఆ రాత్రికి డిన్నర్​ చేసి మంగుళూరులోనే స్టే చేస్తారు.
  • రెండో రోజు టిఫెన్​ తర్వాత ఉడిపికి స్టార్ట్​ అవుతారు. ఉడిపి చేరుకున్నాక హోటల్​లో చెకిన్​ అవుతారు. మధ్యాహ్నం సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ విజిట్​ చేస్తారు. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయం దర్శించుకుని ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని దర్శించుకుని శృంగేరి బయలుదేరుతారు. శృంగేరి శారదాంబ ఆలయ సందర్శన అనంతరం తిరిగి ఉడిపి చేరుకుని ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత గోకర్ణ బయలుదేరుతారు. అక్కడ టెంపుల్​, బీచ్​ విడిట్​ చేసి మురుడేశ్వర్​కి స్టార్ట్​ అవుతారు. అక్కడ టెంపుల్​ దర్శించుకుని ఉడిపికి రిటర్న్​ అవుతారు. ఆ రాత్రికి ఉడిపిలోనే స్టే చేయాలి.
  • ఐదో రోజు అల్పాహారం తర్వాత మంజునాథ ఆలయాన్ని సందర్శించేందుకు ధర్మస్థలానికి బయలుదేరుతారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని మంగుళూరుకు రిటర్న్​ అవుతారు. మధ్యాహ్నం ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. నైట్​ 7 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.43,550, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.34,850, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.33,500 పే చేయాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.29,400, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.26,900 చెల్లించాలి.
  • ఇక 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ అవుట్​ బెడ్​ రూ.20,650 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు, 4 డిన్నర్​లు
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ మార్చి 3, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కూర్గ్​ అందాలను చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర చాలా తక్కువ!

హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్ టూర్ - ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.