Entry of Tesla in India: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మిగతా సంపన్నుల కంటే భిన్నమైన వ్యవహారి శైలితో ఈయన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మస్క్‌కు చెందిన ఈవీ తయారీ దిగ్గజం టెస్లా పేరు మన దేశం అంతటా మార్మోగుతోంది.
మానవుల ఊహలకు అందని సృజనాత్మకతతో ఇటీవలే రోబోవ్యాన్, రోబోకార్లను పరిచయం చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఈ సంస్థ ఇప్పుడు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశంలో టెస్లా రాక గురించి చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే టెస్లా ఇప్పుడు దేశీయ మార్కెట్లోని వివిధ విభాగాల కోసం సిబ్బందిని నియమించుకునేందుకు లిస్ట్ చేయడంతో టెస్లా భారత్ ఎంట్రీపై వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. అయితే టెస్లా భారతదేశానికి వస్తుందా? ఈ వార్తలు ఎంతవరకూ నిజం? దీని వెనక ఉన్న వాస్తవాలేంటి? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.
ఈ అమెరికన్ EV దిగ్గజం 2016లోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ అప్పటి కొత్త టెస్లా మోడల్ 3 కోసం ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో కంపెనీ ప్రణాళికలు పూర్తిగా విఫలమయ్యాయి.
ఆ తర్వాత 2023 సంవత్సరంలో భారత ప్రధాని మోదీ అమెరికాను సందర్శించిన సమయంలో ఎలాన్ మస్క్ దీనిపై మాట్లాడారు. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్ అని, అయితే భారతదేశంలోకి తమ కార్లను దిగుమతి చేసేందుకు టారిఫ్ స్ట్రక్చర్ అంతటా ప్రధాన అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా టెస్లా 2021లోనే భారతదేశంలో రిజిస్టర్డ్ కార్యాలయంతో అనుబంధ సంస్థను స్థాపించింది. అయితే తాజాగా ఇప్పుడు కంపెనీ భారత మార్కెట్ కోసం అమ్మకాలు, సేవలు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్త ఉద్యోగాలను లిస్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే టెస్లా త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రవేశించొచ్చని తెలుస్తోంది. ఇకపోతే టెస్లా ఈ జాబ్స్ లిస్ట్‌లో సర్వీస్ మేనేజర్స్ అండ్ కన్సల్టెంట్స్, సేల్స్ కన్సల్టెంట్స్, స్టోర్ మేనేజర్స్, కస్టమర్ సపోర్ట్ రోల్స్, బిజినెస్ అనలిస్ట్‌లు, ఆర్డర్ అండ్ సేల్స్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌లు వంటి పొజిషన్స్ ఉన్నాయి.
అయితే మన ప్రధాని అమెరికా పర్యటన అనంతరం భారతదేశం కొత్త ఈవీ పాలసీని ప్రకటించిన ఒక ఏడాది తర్వాత కంపెనీ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇక భారత ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం అనేది ప్రపంచ కంపెనీలు రాబోయే మూడు సంవత్సరాలలో మన దేశీయ మార్కెట్లో పెట్టుబడి పెడితే పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లపై తక్కువ సుంకాలను అందిస్తుంది.
'గ్రోక్ 3' అండ్ 'గ్రోక్ 3 మినీ' లాంఛ్ - భూమిపైన అత్యంత తెలివైన ఏఐ చాట్‌బాట్ ఇదేనట!
6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్‌రేట్‌తో రియల్మీ P3 సిరీస్- రూ. 13,999లకే!
'లో కాస్ట్' విత్ 'నో కోడ్'- జొమాటో నుంచి కస్టమర్ సపోర్ట్ AI ప్లాట్‌ఫామ్!