Ind Masters Vs SL Masters 2025 : క్రికెట్ లవర్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూపీఎల్ 2025తో క్రికెట్ ఫ్యాన్స్ చిల్ అవుతుండగా, ఇప్పుడు మరో టోర్నీ వాళ్లందరినీ ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి సీజన్ శనివారం (ఫిబ్రవరి 22) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్ భారత్- శ్రీలంక జట్ల మధ్యే జరగనుంది. ఈ ఐకానిక్ మ్యాచ్‌కు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
కాగా, ఈ టోర్నమెంట్లో టీమ్ఇండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులకు సచిన్‌ను మరోసారి బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ చూసే అరుదైన అవకాశం వచ్చింది. సచిన్ మళ్లీ బ్యాట్ అందుకొని భారత్ తరఫున బరిలోకి దిగితే చూడాలని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
𝑨𝒍𝒍 𝒕𝒉𝒆 𝒘𝒂𝒚 🆙 📸
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 21, 2025
Putting in the work! 💪 The India Masters are gearing up for an electrifying season ahead! 🔋
🎥 them LIVE from Feb 22nd, 7:00 PM onwards on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! 📺 📲 pic.twitter.com/mF5k3IuiAb
దశాబ్దం తర్వాత
ఇక ఈ జట్టులో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో యువీ బరిలోకి దిగనున్నాడు. దీంతో దశాబ్ద కాలం తర్వాత సచిన్- యూవీ మైదానంలో కలిసి ఆడనున్నారు. ఈ జోడీ 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. వీరిద్దరూ మళ్లీ టీమ్ఇండియా జెర్సీ ధరించి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈ ఐకానిక్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.
Alexa play ▶️ 'Aaya sher, aaya sher' 🦁#IMLT20 #TheBaapsOfCricket #IndiaMasters pic.twitter.com/eqFdRasRM0
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 21, 2025
మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి?
- IML మ్యాచ్‌లకు భారత్‌లోని మూడు ప్రధాన నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబయిలో షెడ్యూల్ చేశారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో నిర్వహిస్తారు. సెమీస్ ఇంకా, ఫైనల్ మ్యాచ్‌లకు రాయ్‌పూర్ వేదిక కానుంది.
లైవ్ ఎక్కడ చూడవచ్చు?
- IML మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ (వయా జియోస్టార్), కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్ ద్వారా లైవ్ చూడవచ్చు. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఫ్రీగా చూడవచ్చా?
- IML మ్యాచ్‌ల ప్రసార హక్కులు జియోస్టార్ దక్కించుకుంది. లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా నెట్వర్క్ యూజర్లకు సంబంధిత రీఛార్జ్ ప్లాన్స్‌తో జియోస్టార్ ఉచితంగా స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది.
భారత్ మాస్టర్స్ జట్టు : సచిన్ తెందూల్కర్ (కెప్టెన్), సౌరభ్ తివారీ, గుర్కీరత్ సింగ్ మాన్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, నమన్ ఓజా, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, వినయ్ కుమార్
𝑷𝒓𝒆𝒑 𝑴𝒐𝒅𝒆: 🔛
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 21, 2025
India Masters & Sri Lanka Masters are fine-tuning their game 🏏 as they are set for the big stage! 🏆 The 𝒃𝒂𝒕𝒕𝒍𝒆 𝒃𝒆𝒈𝒊𝒏𝒔 𝒕𝒐𝒎𝒐𝒓𝒓𝒐𝒘 ⚔️#TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex #IndiaMasters #SriLankaMasters pic.twitter.com/7PzRzSUJC4
భారత్ తరఫున బరిలోకి సచిన్ తెందూల్కర్- లైవ్ ఎక్కడ చూడాలంటే?
సచిన్ రికార్డ్‌పై రోహిత్ గురి- ఇంగ్లాండ్ సిరీస్‌లోనే బ్రేక్ చేసే ఛాన్స్!