Rohit Sharma Catch Drop : 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతా బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బాధ వర్ణనాతీతం. అతడు హ్యాట్రిక్‌పై ఉండగా, స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. దీంతో అక్షర్ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో హ్యాట్రిక్ నమోదు చేసే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాడు.
అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ దీనిపై స్పందించాడు. అలాంటి ఈజీ క్యాచ్ పట్టి ఉండాల్సిందని అన్నాడు. లడ్డూ లాంటి క్యాచ్ మిస్ చేసినందుకు అక్షర్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లాలని సరదగా అన్నాడు. 'అది చాలా ఈజీ క్యాచ్. నేను ఆ క్యాచ్ పట్టాల్సింది. కానీ, స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయి. అయితే క్యాచ్ మిస్ చేసినందుకు నేను రేపు అతడిని డిన్నర్‌కు తీసుకెళ్తా' అని రోహిత్ పేర్కొన్నాడు.
“I may take Axar for dinner tomorrow!” - Rohit Sharma 😜#RohitSharma #AxarPatel #BANvIND #ChampionsTrophy #Hitman pic.twitter.com/cxiwDBwxZJ
— Punjab Kings (@PunjabKingsIPL) February 20, 2025
ఇదీ జరిగింది
బంగ్లా ఇన్నింగ్స్‌లో అక్షర్ 9వ ఓవర్ బౌలింగ్‌కు దిగాడు. ఆ ఓవర్లో రెండు, మూడు వరుస బంతుల్లో తంజీద్ హసన్ (25 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (0)ను ఔట్ చేశాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు. తర్వాతి బంతికి, అప్పుడే క్రీజులోకి వచ్చిన జేకర్ అలీ కూడా ఔట్ అయ్యేవాడే. ఔట్ సైడ్ ఎడ్జ్‌తో చేతుల్లోకి వచ్చిన సింపుల్ క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. లడ్డూ లాంటి క్యాచ్‌ను పట్టలేకపోయినందుకు అతడు తీవ్ర అసహానికి గురయ్యాడు. వెంటనే హ్యాట్రిక్‌ను మిస్ చేసినందుకు అక్షర్‌కు సారీ చెప్పాడు. అప్పటికి బంగ్లా స్కోర్ 35-5.
Tanzid ☝️
— Star Sports (@StarSportsIndia) February 20, 2025
Mushfiqur☝️
Hattrick... Well, almost! 😮
📺📱 Start watching FREE on JioHotstar: https://t.co/dWSIZFgk0E#ChampionsTrophyOnJioStar 👉 #INDvBAN, LIVE NOW on Star Sports 1 & Star Sports 1 Hindi! pic.twitter.com/5mn6Eqivci
ఆ క్యాచ్ అందుకుంటే బంగ్లా 200 పరుగులు చేసేది కాదేమో. ఈ ఛాన్స్‌తో జేకర్ (68 పరుగులు)తో రాణించాడు. మరోవైపు తౌహిద్ హృదయ్ (100 పరుగులు) సెంచరీతో అదరగొట్టడం వల్ల బంగ్లా స్కోర్ 200 మార్క్ దాటింది. కాగా, ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 9 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
గిల్ సెంచరీ- టీమ్ఇండియా బోణీ- బంగ్లాదేశ్‌పై విజయం
అటు 11వేల పరుగులు, ఇటు 200వికెట్లు- రోహిత్, షమీ అరుదైన రికార్డులు!