ETV Bharat / state

టీచర్ తిట్టారని మనస్తాపం - పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన విద్యార్థులు - 4 STUDENTS MISSING IN AMBERPET

అంబర్‌పేట్‌లో అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం - నలుగురు కలిసి ఒకరి బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తింపు - బుధవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు

Amberpet Students Missing Case Solved
Amberpet Students Missing Case Solved (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 7:43 PM IST

Amberpet Students Missing Case Solved : స్కూలులో టీచర్లు తిట్టారని నలుగురు విద్యార్థులు ఊరువదిలి తల్లిదండ్రులను, స్కూల్ సిబ్బందిని, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. అంబర్‌పేట్‌లోని అదృశ్యమైన నలుగురు విద్యార్థుల ఆచూకీ ఎట్టకేలకు లభించింది. యాదగిరిగుట్టలో బంధువుల ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు కలిసి ఒకరి బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో సీఐ రమేశ్ మట్లాడూతూ, నలుగురు విద్యార్థులు యాదగిరిగుట్టలో ఓ వ్యక్తి దగ్గర ఉన్నారని అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం రావడంతో తమ టీమ్ అప్రమత్తమయ్యిందని తెలిపారు. తమ టీమ్ పిల్లలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారని అన్నారు. వారు హైదరాబాద్ నుంచి ట్రైన్​ ద్వారా యాదగిరి గుట్టకు వచ్చినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఆ నలుగురు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు.

"నలుగురు విద్యార్థులు యాదగిరిగుట్టలో ఓ వ్యక్తి దగ్గర ఉన్నారని అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం రావడంతో మా టీమ్ అప్రమత్తమయ్యింది. మా టీమ్ పిల్లలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. వారు హైదబాద్ నుంచి ట్రైన్​ ద్వారా యాదగిరి గుట్టకు వచ్చినట్లు తెలిసింది. ఆ నలుగురు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. పిల్లల తల్లిదండ్రులు, అంబర్‌పేట్‌ పోలీసులు రావడంతో వారికి అప్పగించాం." రమేశ్, సీఐ

అసలేం జరిగింది : అంబర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ తిట్టారని ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు 19వ తేదీనుంచి కనిపించకుండా పోయారు. కంగారు పడిన విద్యార్థుల తల్లిదండ్రులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారంతా యాదగిరి గుట్టలో దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లి అడవిలో భర్త అదృశ్యం - ఐదుగురు పిల్లలతో తల్లి బతుకుపోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.