ETV Bharat / health

చైనాలో కరోనా లాంటి కొత్త వైరస్ గుర్తింపు- మనుషులకు సోకే ఛాన్స్ ఉందన్న సైంటిస్ట్స్! - CHINA NEW VIRUS UPDATE

-కరోనాలా ప్రమాదకరంగా మారుతుందా? -ఈ వైరస్​పై శాస్త్రవేత్తలు ఏం అంటున్నారు?

CHINA NEW VIRUS UPDATE
CHINA NEW VIRUS UPDATE (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Feb 22, 2025, 11:25 AM IST

China New Virus Update: చైనాలో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కెయూ5- కోవ్‌-2గా పిలుస్తున్నారు. ఈ వైరస్ కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు అనేక కథనాలు పేర్కొన్నాయి. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై విస్తృత పరిశోధనలు చేసి 'బ్యాట్ ఉమెన్‌'గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం వహించారు. ఇందులో గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం 'సెల్‌' జర్నల్‌లో ప్రచురితమైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మానవులకు సోకే అవకాశం ఉందా?
ఈ వైరస్‌ మెర్బెకోవైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) ఉప రకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. ఇది హెచ్‌కేయూ5 కరోనా వైరస్‌ సంతతికి చెందినదిగా వెల్లడించారు. ఈ వైరస్‌ను తొలుత హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ రకం గబ్బిలాల్లో గుర్తించినట్లు వివరించారు. తాజా పరిశోధన ప్రకారం.. HKU5-CoV-2 నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ వైరస్‌ సామర్థ్యం కొవిడ్‌-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే?
ఈ వైరస్ మానవులకు సోకుతుందని తేలినా.. కరోనా లాగా ప్రమాదకారి కాదని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ రకానికి చెందిన వైరస్​లతో ఇబ్బంది ఉన్నా.. అన్ని వైరస్​లు జంతువుల నుంచి మానవులకు అంత సులభంగా సోకే అవకాశం లేదని వివరించారు. గతంలో వచ్చిన సార్స్, మెర్స్ వైరస్​లకు మనిషి నుంచి మనిషికి సులభంగా సోకే శక్తి ఉందని తెలిపారు. అదే ప్రస్తుత HKU5-CoV-2 వైరస్​కు ఇంత సామర్థ్యం లేదని వెల్లడించారు. ఫలితంగా మానవుల్లో వ్యాప్తి చెందే అవకాశం తక్కువని నిపుణులు అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చైనా కొత్త వైరస్​ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? నివారణ ఎలా? చికిత్స ఏదైనా ఉందా?

ఆ జాగ్రత్తలు తీసుకోండి : 'చైనా కొత్త వైరస్'​ పట్ల వైద్యారోగ్య శాఖ సూచనలివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.