Jawa 350 Legacy Edition Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్ 'జావా 350' కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ లెగసీ ఎడిషన్ పేరుతో తీసుకొచ్చింది. దీనిలో అనేక స్టాండర్డ్ యాక్సెసరీలను అందించింది. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇది మొదటి 500 మంది కస్టమర్లకు రూ. 1.99 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆలస్యం దీని ఫీచర్లు, ఇంజిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
జావా 350 లెగసీ ఎడిషన్ ఫీచర్లు: కంపెనీ ఈ కొత్త 'జావా 350 లెగసీ ఎడిషన్'లో టూరింగ్ వైజర్, పిలియన్ బ్యాక్‌రెస్ట్, క్రాష్ గార్డ్ వంటి యాక్సెసరీలను అందించింది. దీనితో పాటు కస్టమర్లకు లెదర్ కీచైన్, జావా 350 కలెక్టర్ ఎడిషన్ మినియేచర్ మోడల్ కూడా వస్తుంది. ఇది కాకుండా ఈ మోటార్‌సైకిల్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఇది ఇప్పటికే ఉన్న 334cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 7,000rpm వద్ద 22.5hp పవర్ అండ్ 5,000rpm వద్ద 28.1Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గతేడాది కొన్ని కొత్త వేరియంట్ల పరిచయం: గత సంవత్సరం కంపెనీ 'జావా 350' కోసం కొన్ని కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. దీని మొత్తం ధరను రూ. 16,000 తగ్గించింది. దీని బేస్ స్పోక్ వీల్ వేరియంట్ ధర రూ. 1.99 లక్షలు కాగా, అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 2.08 లక్షలు. అదే సమయంలో స్పోక్ వీల్‌తో కూడిన టాప్-ఎండ్ క్రోమ్ వేరియంట్ ధరను రూ. 2.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
ఇది కాకుండా దీని టాప్-స్పెక్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 2.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు ప్రారంభించిన 'జావా 350 లెగసీ ఎడిషన్' మొదటి 500 మంది కస్టమర్లకు రూ. 1.99 లక్షల పరిచయ ధరకు అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ధర రూ. 16,000 పెరిగే అవకాశం ఉందని జావా తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్- ఇకపై కంటెంట్ క్రియేటర్లపై కాసుల వర్షమే..!
వారెవ్వా ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ చూశారా?- ప్రపంచంలోనే అత్యంత స్లిమ్ డిజైన్‌లో!- ధర ఎంతంటే?
వ్యాపారులకు శుభవార్త- ఇకపై ఎండతో Paytm సౌండ్‌బాక్స్ ఛార్జ్!- కరెంట్‌తో పనిలేకుండానే 'పేటీఎం కరో'!