How to Make Idli with Dosa Batter: దోశ పిండి - మెజార్టీ జనాల ఇళ్లల్లో తప్పకుండా ఉంటుంది. ఒక్కసారే మూడు నాలుగు రోజులకు సరిపడే విధంగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఆ రోజుకు ఎంత కావాలో అంత పిండి తీసుకుని మిగిలినది ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటారు. ఇక ఈ పిండితో ప్లెయిన్, మసాలా, ఎగ్, కారం దోశ అంటూ ఎన్ని రకాలుగా వీలుంటే అలా తయారు చేసుకుని తింటుంటారు. అయితే దోశలు ఎంత బాగున్నా రోజూ తినాలంటే బోర్ కొడుతుంది. అలాగని ఆ పిండిని పడేయలేము. అలాంటి సమయాల్లో దోశ పిండితో సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఇడ్లీలు ప్రిపరే చేసుకోవడం ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా దోశ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండితో అటు దోశలు, ఇటు ఇడ్లీలు ఏదైనా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర దోశ పిండి ఉంటే ఆ తర్వాత ఇడ్లీలు చేయాల్సిన విధానంపై లుక్కేయండి. మరి దోశ పిండి ఎలా చేసుకోవాలంటే,
కావాల్సిన పదార్థాలు:
- మినపప్పు - 1 కప్పు
- మెంతులు - 1 టీ స్పూన్
- రేషన్ బియ్యం - 3 కప్పులు
- అటుకులు - అర కప్పు
తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి మినపప్పు, మెంతులు తీసుకుని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరో గిన్నెలోకి రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడగి వీటిని కూడా 5 గంటలపాటు నాననివ్వాలి.
- మినపప్పు, బియ్యం బాగా నానిన తర్వాత మరోసారి రెండింటిని కడగాలి. అలాగే పిండి గ్రైండ్ చేసుకునే ఐదు నిమిషాల ముందు ఓ గిన్నెలోకి అటుకులు, కొన్ని నీళ్లు పోసి నాననివ్వాలి.
- మిక్సీజార్ తీసుకుని మినపప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే మిక్సీజార్‌లోకి నానబెట్టిన అటుకులు, బియ్యం కొన్ని వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మినపప్పు పిండి వేసిన గిన్నెలోకి కలుపుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే దోశ పిండి రెడీ అయినట్లే..
- ఇప్పుడు ఈ దోశ పిండిలోకి శుభ్రంగా కడిగిన సన్నటి గోధుమరవ్వ అరకప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఓ గంట సేపు పక్కకు పెట్టాలి. మీ దగ్గర ముందే తయారు చేసుకున్న దోశ పిండి ఉన్నా అందులోకీ గోధుమ రవ్వ కలుపుకోవాలి. ఉప్పు అంతకుముందే వేసుకుంటారు కాబట్టి అవసరం లేదు.
- ఓ గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
- ఈలోపు ఇడ్లీ ప్లేట్స్‌కు నూనె అప్లై చేసి పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్‌లోకి పిండిని వేసుకోవాలి.
- ఇడ్లీ పాత్రలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత పెట్టాలి.
- ఆపై మంటను మీడియంలో ఉంచి 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు రెడీ.
- ఓ 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పల్లీ చట్నీ, కారప్పొడితో తింటే సూపర్‌గా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.
బంగాళదుంపతో సూపర్ టేస్టీ "ఇడ్లీలు" - పప్పు రుబ్బే పనిలేకుండా నిమిషాల్లో రెడీ!
పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్ అద్దిరిపోతాయి!
పచ్చి బఠాణీలతో "ఇడ్లీలు, గుంట పొంగనాలు" - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!