ETV Bharat / state

చుట్టూ జనం ఉన్నారన్న భయమే లేదు - బస్టాప్​లో తండ్రిని పొడిచి చంపిన కుమారుడు - FATHER BRUTALLY MURDERED

ఈసీఐఎల్‌లో దారుణం, కుమారుడి చేతిలో తండ్రి హతం - ఈసీఐఎల్‌ బస్టాప్‌లో తండ్రిపై కత్తితో దాడి చేసిన కుమారుడు - నిందితుడు సాయి(25)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

FATHER BRUTALLY MURDERED
MURDER IN MEDCHAL DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 3:59 PM IST

Updated : Feb 22, 2025, 4:16 PM IST

Murder Case in Medchal District : ఈనెల 16న మేడ్చల్ జాతీయ రహదారి-44పై పట్టపగలు అన్నను తమ్ముడు చంపిన ఘటన మరువకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్​ వద్ద దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు.

నిందితుడి అరెస్ట్ : బస్టాప్​ వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసి సుమారు 10-15 కత్తితో పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని పక్కనే ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తండ్రి మొగిలి మద్యానికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడని కుమారుడు సాయి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణాలు కూడా మొగిలి హత్యకు కారణాలుగా పోలీసులు గుర్తించారు.

FATHER BRUTALLY MURDERED
నిందితుడు సాయి(25) (ETV Bharat)

సీసీటీవీలో రికార్డు : మృతిచెందిన వ్యక్తిని సికింద్రాబాద్ లాలా పేటకు చెందిన ఆర్​ఎల్​ మొగిలిగా, నిందితుడిని అతని కుమారుడు సాయి కుమార్​ అని తెలిపారు. సాయి కుమార్ కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

బస్టాప్ వద్ద పట్టపగలే జరిగిన ఈ హత్య స్థానికులను కలవరానికి గురిచేసింది. వారం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండొవది. సరిగ్గా వారం క్రితం మేడ్చల్ జాతీయ రహదారి-44పై పట్టపగలే అన్నను అతని సొంత తమ్ముడు, మరో బంధువు కలిసి అందరూ చూస్తుండగానే పొడిచి చంపారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపినా రాజధానిలో ఇంత దారుణమైన ఘటనలు జరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మేడ్చల్‌లో దారుణం - వెంటాడి, వేటాడి అన్నను హత్య చేసిన సొంత తమ్ముళ్లు

'ఎప్పుడూ ‘యూ బెగ్గర్‌’ అని అవమానించేవారు - అందుకే తాతయ్యను చంపేశా'

Last Updated : Feb 22, 2025, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.