ETV Bharat / sports

'ఔను విడిపోతున్నాం- చాహల్‌, ధనశ్రీ డివోర్స్ కన్ఫార్మ్!'- ఇన్​స్టా పోస్ట్​లు వైరల్ ​ - CHAHAL DHANASHREE DIVORCE

చాహల్, ధనశ్రీ డివోర్స్- ఇద్దరి పోస్ట్​లు వైరల్​

Chahal Dhanashree Divorce
Chahal Dhanashree Divorce (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 21, 2025, 9:11 AM IST

Chahal Dhanashree Divorce : టీమ్ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌- ధనశ్రీ వర్మ డివోర్స్​ తీసుకోనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా వీరిద్దరికీ విడాకులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ, తీర్పు వెలువరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చాహల్, ధనశ్రీ వేర్వేరుగా షేర్ చేసిన ఓ పోస్ట్​లు విడాకుల కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒత్తిడి నుంచి విముక్తి లభించిందంటూ ధనశ్రీ పోస్ట్ చేయగా, తనను దేవుడే కాపాడాడంటూ చాహల్ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు.

'మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈ రోజు ఏదైనా విషయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో ఛాన్స్​ ఉంటుందన్న విషయం తెలుసుకోండి. బాధలన్నీ మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి. భగవంతుడిపై మీకున్న విశ్వాసమే మీకు మంచి జరిగేలా చేస్తుంది' అని ధనశ్రీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

ధనశ్రీ వర్మ ఇన్​స్టా స్టోరీ
ధనశ్రీ వర్మ ఇన్​స్టా స్టోరీ (Source : Dhanasree Insta Screeshot)

దేవుడే కాపాడుతున్నాడు
అంతకుముందు చాహల్ కూడా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. తనను ఎల్లప్పుడు ఆ భగవంతుడే కాపాడుతున్నాడని పేర్కొన్నాడు. 'ఆ దేవుడు నన్ను లెక్కలేనన్నిసార్లు రక్షించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని నేను గుర్తించేలోపే భగవంతుడు బయటపడేశాడు. ఎల్లప్పుడూ నాకు రక్షణగా ఉన్న ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని చాహల్ పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరికీ విడాకులు మంజూరైనట్లు వస్తున్న వార్తలు నిజమే అయి ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

చాహల్ ఇన్​స్టా స్టోరీ
చాహల్ ఇన్​స్టా స్టోరీ (Source : Chahal Insta Screeshot)

2020లో చాహల్‌ - ధనశ్రీవర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట, తమ పెళ్లి ఫొటోలు డిలీట్​ చేయడం అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసి ఫ్యాన్స్​కు హింట్ ఇచ్చారు. అలాగే ధనశ్రీ తన పేరు నుంచి 'చాహల్‌' పదాన్ని తొలగించడం వల్ల విడాకులపై ఊహాగానాలు మొదలయ్యాయి.

బిగ్​బాస్​ హౌస్​లోకి చాహల్​! - డివోర్స్​ రూమర్స్ నడుమ ఆ ఇద్దరితో ఎంట్రీ!

చాహల్ డివోర్స్ రూమర్స్! - వైరలవుతోన్న ధనశ్రీ ఇన్​స్టా పోస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.