ETV Bharat / spiritual

ఆ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశం- ఈశ్వర ఆలయ సందర్శనం శుభకరం! - HOROSCOPE TODAY

2025 ఫిబ్రవరి 22వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2025, 3:31 AM IST

Horoscope Today February 22nd 2025 : 2025 ఫిబ్రవరి 22వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్స్ మొదలు పెట్టడానికి మంచి రోజు. వృత్తి వ్యాపారాలలో అవరోధాలను పట్టుదలతో అధిగమిస్తారు. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దైవబలం అండగా ఉంటుంది. శ్రీలక్ష్మీనారాయణుని ఆలయ సందర్శనం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా పని ఒత్తిడితో నిండి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఒక ఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే విజయాలు చేకూరుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలకన్నా సమిష్టి నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసర విషయాలలో జోక్యం తగదు. శివారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. స్వీయ క్రమశిక్షణతో సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం నడుస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈశ్వరుని ఆలయ సందర్శనం శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. సమస్యలకు ఎదురొడ్డి నిలిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. శత్రువులను తక్కువగా అంచనా వేయద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు పొందుతారు. ఇష్టమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు నివారించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అదుపులేని భావోద్వేగాలతో అనర్థం కలిగే ప్రమాదముంది. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిది. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులపై అదుపు ఉంచండి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన ఉత్తమం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదగడానికి చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించిన ప్రయోజనాల కోసం కఠిన శ్రమ తప్పదు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. దైవబలం అండగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదం అవుతుంది. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. ఖర్చులను అదుపు చేయండి. అవమానం పాలయ్యే పరిస్థితులకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివ పంచాక్షరీ మంత్రజపం ఉత్తమం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కఠిన శ్రమతోనే వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.