Hotel Taj Banjara Seized : ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నం.1లో ఓ భవనాన్ని సీజ్ చేశారు. దాదాపు రూ.1.43 కోట్ల బకాయి ఉండటంతో గతంలోనూ చెల్లింపులు చేయాలని నోటీసులు జారీ చేశారు. స్పందన లేకపోవడంతో భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్‌పై కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా హోటల్ ప్రతినిధులు, అధికారులతో చర్చించి రూ.31.55 లక్షలు చెల్లించారు.
మార్చి 31లోగా మిగతా బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాగా ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కోసం ఫిబ్రవరి 22తో పాటు మార్చి 01,08,15,22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా మొండి బకాయిలను వసూలు చేయాల్సిందిగా ఇప్పటికే కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వసూల్లపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సీరియస్ : కాగా ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహారిస్తోంది. మొండి బకాయిలు చెల్లించని ఆస్తులను బల్దియా అధికారులు సీజ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి రావాల్సిన మొండి బకాయిలు రూ.9,800 కోట్లు కాగా, ఆస్తి పన్ను చెల్లింపులో ఐదు లక్షల నిర్మాణాలు అలసత్వం వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.2,200 కోట్ల పన్ను వసూలు జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రేటర్‌లో మొత్తం 23 లక్షల నిర్మాణాల్లో పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య 12 లక్షలు మంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో లక్షా 8 వేల ఆస్తుల సంబంధించి రూ.320 కోట్లను జీహెచ్‌ఎంసీ వసూలు చేసింది. ఆస్తి పన్ను వసూలుపై అధికారులకు బల్దియా కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్చి 29లోగా మొండి బకాయిలు వసూళ్లు చేయాల్సిందేనని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి టార్గెట్ విధించారు.
రెండేళ్లయినా పనులు ప్రారంభించకపోతే? - కమిషనర్ ఉత్తర్వుతో ఇంజినీర్ల హడల్
దోమల పని పట్టేందుకు GHMC కొత్త ప్లాన్ - ఒక్కటీ మిగలకుండా ఇలా చేస్తారట!