TGSRTC Special Discount For Hyderabad-Vijayawada Route : హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించింది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో నేరుగా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. రాజధాని ఏసీ సర్వీసు బస్సుల్లో 8 శాతం రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ యాజమాన్యం ప్రయాణికులను కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ సంస్థ వెబ్‌సైట్ https://www.tgsrtcbus.inను సంప్రదించవచ్చని ప్రయాణికులకు సూచించింది.
హైదరాబాద్ - బెంగళూరు టికెట్‌పై 10 శాతం : రెండు రోజుల క్రితమే బెంగళూరు రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. బెంగళూరుకు నడిచే అన్ని తెలంగాణ ఆర్టీసీ సర్వీసులకు ఇది వర్తిస్తుందని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్‌తో ఒక్కొక్కరికి టికెట్‌పై రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ పేర్కొంది. ప్రయాణికులు తమ రిజర్వేషన్ల కోసం టీజీఎస్ ఆర్టీసీ సంస్థ వెబ్సైట్లో వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.
ఆ రూట్లో బస్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
మహాశివరాత్రికి శైవ క్షేత్రాలకు వెళ్తున్నారా? - మీకోసమే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు