ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ వారం పెళ్లి ఫిక్స్! శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు! - WEEKLY HOROSCOPE

ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు వారఫలాలు

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2025, 4:31 AM IST

Weekly Horoscope From February 16th To February 22nd 2025 : ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన పోటీ సవాళ్లు ఎదురుకావచ్చు. పట్టుదలతో పని చేసి సవాళ్ళను అధిగమిస్తారు. మీ వాక్చాతుర్యంతో వృత్తి పరంగా అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, కాంట్రాక్టులు సొంతం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టుదలకు, పంతాలకు పోవద్దు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు సహనంతో ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. అనవసర ఖర్చులు పెట్టే ముందు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి. దైవబలం అండగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో పురోగతి, విజయం ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు రావడంతో పని ఒత్తిడి పెరిగే సూచన ఉంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి అదనపు కృషి, అంకితభావం అవసరం. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఇంకొంత సమయం వేచి చూడాలి. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం చివరిలో ఊహించని ఆర్థిక లాభాలు రావడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. భూములు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కష్టపడే వారికి ఆటంకాలు అవరోధం కాదని నిరూపిస్తారు. పనిభారం కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడకుండా ధ్యానం చేయండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయాణాలు చేసే సూచన ఉంది. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. వృత్తి పరంగా ఉన్నతాధికారుల మద్దతు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. స్థానచలనం సూచన ఉంది. వ్యాపారులు రుణాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో హడావిడి ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. బాధ్యతలు, కర్తవ్యాలను నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు కఠిన శ్రమతో మాత్రమే ఆశించిన ఫలితాలు అందుకోగలరు. కొన్ని ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబ ఆస్తి వ్యవహారాలలో సామరస్య పరిష్కారానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ శుభకరం

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగులు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు సమయస్ఫూర్తితో పనిచేసి మంచి లాభాలు గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి శుభసమయం నడుస్తోంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. తీరికలేని పనులతో విశ్రాంతి లోపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వీడి ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. చట్టపరమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. కుటుంబ సమస్యలకు సంబంధించిన చర్చలలో సంయమనం పాటించడం అవసరం. వారం చివరలో వృత్తి పరంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం మాటలను అదుపులో ఉంచుకోవడం అవసరం. పనిపట్ల చిత్తశుద్ధి, శ్రద్ధ ఉండాలి. పనులను వాయిదా వేయడం మంచిది కాదు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం వలన సమయం డబ్బు రెండు ఆదా అవుతాయి. భూమి స్థిరాస్తి వివాదాలు శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. వ్యాపార సంబంధిత కార్యకలాపాలకు ఈ వారం అంత అనుకూలంగా కాదు. వ్యాపారంలో పోటీ సవాళ్లు ఎదురవుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం తెలివిగా పెట్టుబడులు పెట్టడం కీలకం. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉత్తమమైనది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. భూమి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో పెద్దల సలహాలు పాటించడం మంచిది. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు తీవ్రమైన కృషితో పదోన్నతులు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారులు భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి మరికొంతకాలం వేచి చూడాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శనిస్తోత్రం పఠించడం ఉత్తమం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వారం ప్రథమ భాగం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి నైపుణ్యాలను పెంచుకోవడం అవసరం. వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు లాభదాయకంగా ఉంటాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ సంప్రదించడం అవసరం. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. బుద్ధిబలంతో తెలివిగా వ్యవహరించి వృత్తి పరంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు సమాజంలో మీ హోదాను పెంచుతాయి. కొత్త అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. గృహంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.