ETV Bharat / education-and-career

మీ పిల్లలకు లెక్కలంటే భయమా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో ప్రాబ్లమ్స్​ సాల్వ్​ చేస్తారు! - HOW TO OVERCOME THE MATHS FEAR

-పిల్లల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలిగించాలా? -ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​ రిజల్ట్​ అంటున్న నిపుణులు

How to Overcome the Mathematics Fear
How to Overcome the Mathematics Fear (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2025, 11:05 AM IST

How to Overcome the Mathematics Fear in Students: ఫిబ్రవరి నుంచి ఏప్రిల్​ వరకు విద్యార్థులు బిజీబిజీగా గడుపుతుంటారు. కారణం ఈ రోజుల్లో ఎగ్జామ్స్​ ఉంటాయి. దీంతో అందరూ ఆ ప్రిపరేషన్​లో ఉంటారు. ఇక పరీక్షలు అంటే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ టఫ్​గా ఉండటమే. ఒకరికి ఇంగ్లీష్​ అంటే భయం, మరికొద్దిమందికి హిందీ, తెలుగు ఇలా ఉంటాయి. కాగా చాలా మంది పిల్లలకు మ్యాథ్స్‌ అనగానే గుబులు. ఏ చిన్న ప్రాబ్లమ్​ ఇచ్చినా చాలా టఫ్​ అని భావించి దానిని సాల్వ్​ చేయడానికి భయపడుతుంటారు. ఇక ఈ భయం మొత్తంగా చదువులపైన వారి ఆలోచననే మార్చేస్తుంది. అయితే దీన్ని పోగొట్టడానికి ఉపాధ్యాయులూ, పేరెంట్స్​ వినూత్నంగా ఆలోచించాల్సిందేనని, అప్పుడే గణితమంటే కష్టమనే భావన పోయి ఇష్టం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భయానికి కారణాలివే:

  • లెక్కలు నేర్చుకునే క్రమంలో ఏదైనా పొరపాటు చేస్తే టీచర్లు దాన్ని పెద్దది చేసి చూపడం, కష్టమైన అంశాలను సులభంగా బోధించలేకపోవడం, సాధనలో తగిన సహకారం లభించకపోవడం లాంటివన్నీ అనుభవాలు ఒకట్రెండుసార్లు ఎదురైతే, భయం, అసహనంతో సబ్జెక్టును దూరం పెట్టడం చేస్తుంటారని చెబుతున్నారు.
  • తెలివైనవాళ్లే మ్యాథ్స్‌ చేయగలరనే భావనను కల్పిస్తుంటారు కొద్దిమంది. దీనివల్ల అది నా వల్ల కాదులే అనే ఆలోచనతో దాని మీద దృష్టి నిలపారని వివరిస్తున్నారు.
  • ప్రారంభంలోనే సృజనాత్మకంగా, ప్రాక్టికల్‌గా కాకుండా బట్టీ పట్టించే పద్ధతిలో నేర్పించడం వల్లనా సబ్జెక్ట్​పై అనాసక్తి ఏర్పడవచ్చని వివరస్తున్నారు.

ఈ లక్షణాలు ఉంటే మ్యాథ్స్​ అంటే భయం ఉన్నట్లే!:

  • లెక్కలు చేయాలంటే భయపడటం, గణితానికి సంబంధించి ఎలాంటి అంశానికైనా దూరంగా ఉండటం లాంటివి కనిపిస్తాయని చెబుతున్నారు.
  • ఒకటి రెండు సార్లు లెక్కల్లో మార్కులు తక్కువ రావడంతో ఆ సబ్జెక్టులో తాము ఎప్పటికీ వెనకేనన్న భావనలోకి వెళతారని అంటున్నారు.
  • లెక్కల హోమ్‌వర్క్‌ చేయకపోవడం, స్కూల్‌ అంటేనే ఆసక్తి చూపకపోవడం వంటివి కనిపిస్తాయని అంటున్నారు.
  • అలాగే టఫ్​ లెక్కలు సాల్వ్​ చేయలేకపోతే వెంటనే కోపాన్ని, అసహనాన్ని చూపడం చేస్తారని చెబుతున్నారు.
  • పరీక్షల సమయంలో కడుపునొప్పి, తలనొప్పి లాంటివాటికి గురికావడం ఆందోళన కారణంగా వచ్చేవే అని చెబుతున్నారు. ఇలాంటి అనుభవాలు ఉంటే సబ్జెక్టుపైన అయిష్టతను పెంచుతాయని, ఆత్మస్థైర్యమూ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

పరిష్కారం ఎలా: భయం వెనక ఉండే కారణాల్ని పలు కోణాల్లో విశ్లేషించి గుర్తిస్తే సమస్యను అధిగమించడం తేలికవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం,

  • ప్రాక్టీకల్​గా నేర్పిస్తే మేలని చెబుతున్నారు. అంటే లెక్కల్ని వస్తువుల సాయంతో నేర్పిస్తే, పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారని సూచిస్తున్నారు. అడిషన్స్​, తీసివేతలూ, మల్టిఫ్లికేషన్​, భాగహారాలనూ ఈ పద్ధతిలో నేర్పించమని సలహా ఇస్తున్నారు.
  • "సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్నట్టుగా లెక్కల్లో పర్ఫెక్ట్​ కావాలంటే ప్రాక్టీసు చాలా ముఖ్యమంటున్నారు. ఎంత అలవాటైతే అంత ఆత్మవిశ్వాసంతో ఉంటారని, కాబట్టి రోజూ కొంత సమయం కచ్చితంగా గణితానికి కేటాయించమని, వీలైతే రెండు పూటలా సాధన చేయించమని సూచిస్తున్నారు.
  • కూడికలూ, తీసివేతలూ, గుణకారాలూ ఉండే గేమ్స్, పజిల్స్‌ లాంటివాటితో గణిత నైపుణ్యాలను అలవాటు చేయొచ్చని చెబుతున్నారు.
  • గణితాన్ని సృజనాత్మక సబ్జెక్టుగా చూడాలి. జవాబు గురించికంటే ప్రాసెస్‌ గురించి ఆలోచించేలా చేయమంటున్నారు.
  • జంటగా, చిన్న బృందంతో కలిసి నేర్చుకునేలా చేస్తే మేలని చెబుతున్నారు. ఒకే సమస్యను ఇతరులు భిన్నంగా ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. దీంతో భయంతోకాకుండా, సరదాగా నేర్చుకుంటారని చెబుతున్నారు.
  • పొడవు, బరువు లాంటి అంశాలతో ఇంట్లోనూ ప్రాక్టికల్స్‌ చేయించండి. ఒక వంటకానికి కావాల్సిన పదార్థాల్ని కొలవమని చెప్పండి. డబ్బునీ, గది వైశాల్యాన్నీ, చుట్టుకొలతనూ లెక్కించమనండి.
  • భయాన్ని అధిగమించేవరకూ కొన్నాళ్లపాటు సబ్జెక్టు స్పెషలిస్టుతో ప్రత్యేక తరగతులు చెప్పించవచ్చని, సానుకూల దృక్పథంతోనే టీచర్లూ, తల్లిదండ్రులూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని సూచిస్తున్నారు.

పదో తరగతి విద్యార్థులు కాస్త శ్రద్ధ పెడితే చాలు - ఆ సబ్జెక్ట్​లో మంచి మార్కులు మీ సొంతం!

పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలా? - ఈ టిప్స్ ఫాలో అయితే ఇట్టే వచ్చేస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.