Ravichandran Ashwin On Team India : టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో 'సూపర్ స్టార్ కల్చర్' గురించి తాజాగా మాట్లాడాడు. క్రికెటర్లు సాధారణంగా ఉండాలని, వారిని యాక్టర్‌లుగా కాకుండా క్రీడాకారులుగా చూడాలని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో క్రికెటర్లను సెలబ్రిటీలుగా చూసే ట్రెండ్ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. సాధారణ ప్రజలు గుర్తించగలిగే వ్యక్తులుగా క్రికెటర్లు ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.
'భారత క్రికెట్‌లో విషయాలను సాధారణంగా ఉంచడం చాలా ముఖ్యం. జట్టులోని ఈ సూపర్ స్టార్‌డమ్, సూపర్ సెలబ్రిటీలను మనం ప్రోత్సహించకూడదు. మేం క్రికెటర్లమే, సూపర్ స్టార్‌లు కాదు. సామాన్య ప్రజలు తమతో మమ్మల్ని పోల్చుకోగలిగేలా ఉండాలి. టీమ్‌ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూడండి. వాళ్లు కెరీర్‌లో చాలా సాధించారు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. క్రికెటర్ ఓ సెంచరీ కొట్టారంటే అది అతడి ఘనకార్యం కాదు. అది అతడి రెగ్యులర్ డ్యూటీ అని గుర్తించాలి. ఇలాంటి అఛీవ్‌మెంట్స్ కంటే మన లక్ష్యాలు పెద్దవిగా ఉండాలి' అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ 'ఆష్ కీ బాత్'లో పేర్కొన్నాడు.
అలానే ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టు ఎంపికపై కూడా రవింద్రన్ అశ్విన్ తన ఆలోచనలు షేర్ చేసుకున్నాడు. ‘దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లు? ఎందుకని ప్రశ్నించాడు. ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందే ఉంటారని అనుకున్నట్లు తెలిపాడు. 'హార్దిక్ పాండ్యతో పాటు ఇద్దరు లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్లు (జడేజా, అక్షర్) కలిపి మొత్తం ముగ్గురు టాప్ ఆల్ రౌండర్లు ఉంటారు.
అలానే స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడుతాడు. వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించాలనుకుంటే ఒక పేసర్‌ని తప్పించి, హార్దిక్‌ని రెండో పేసర్‌గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదా మూడో సీమర్ అవసరం అనుకుంటే ఒక స్పిన్నర్‌ను వదులుకోక తప్పదు' అని తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి
The countdown has begun! ⏳
— BCCI (@BCCI) February 15, 2025
Only 5⃣ days away from #TeamIndia's opening clash of #ChampionsTrophy 2025 🙌 pic.twitter.com/mYCnAI9vDq
భారత అథ్లెట్లకు పురస్కారాలు- శ్రీజేశ్కు పద్మ భూషణ్, అశ్విన్‌కు పద్మ శ్రీ
హిందీపై కాంట్రవర్సీయల్ కామెంట్స్! - వివాదాల్లో చిక్కుకున్న అశ్విన్!