2025 Champions Trophy Live Streaming : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వరకు జరగనుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ టోర్నీ 19 రోజులపాటు జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 19న కివీస్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెర లేవనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ఎక్కడ చూడాలి? లైవ్ మ్యాచ్‌లు ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భారత్‌లో జియో, హాట్ స్టార్ నెట్వర్క్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, తమిళం, కన్నడ వంటి 8 భాషలు, 16 ఫీడ్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో లైవ్ మ్యాచ్‌లు వీక్షించవచ్చు.
బ్రాడ్ కాస్టింగ్ వివరాలు (టీవీ, డిజిటల్)
- ఇండియా- జియోస్టార్ (జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం, స్టార్ స్పోర్ట్, నెట్ వర్క్ 18 ఛానెల్స్)
రేడియో ప్రసారం
- ఆల్ ఇండియా రేడియో
ఫ్రీగా ఎలా చూడొచ్చా?
ఐసీసీ టోర్నమెంట్లకు భారత్‌లో స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన 8 ఛానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికొస్తే, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కలిపి జియోస్టార్‌గా మారాయి.
ఈ ట్రోఫీ మ్యాచ్‌లు జియోస్టార్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చు. అయితే గతంలో జియో ఫ్రీగా మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదు. జియో సినిమా, హాట్‌స్టార్ ఇప్పుడు జియోస్టార్‌గా మారడం వల్ల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రీ గా చూసే ఛాన్సే లేదు.
A substantial prize pot revealed for the upcoming #ChampionsTrophy 👀https://t.co/i8GlkkMV00
— ICC (@ICC) February 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్
- ఫిబ్రవరి 23- పాకిస్థాన్
- మార్చి 02- న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి
ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ - టైటిల్ వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు?
ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్స్- ఈ సారి లిస్ట్‌లో హిట్‌మ్యాన్ చేరతాడా?