Income From Waste Electronic Goods : ప్రస్తుత డిజిటల్ కాలంలో మొబైల్ మనిషికి మరో అవయవంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దానితోనే కాలక్షేపం. ఆఫీస్ అవసరాలు, పాఠశాల, కళాశాలకు సంబంధించిన నోట్స్ కూడా అందులోనే చేసుకుంటున్నారు. దీంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఫోన్ తప్పనిసరి అయింది. వాటితో పాటు ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, ప్రింటర్లు ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను నిత్య జీవితంలో వినియోగిస్తున్నాం.
ఏ పని కావాలన్నా ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవడం, కొత్త వెర్షన్ అందుబాటులోకి రావడంతో వాటిని ఇంట్లో ఓ మూలన పడేస్తున్నారు. అయితే అలా పనిచేయని పాత సెల్‌ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలా అని అనుకుంటున్నారా?. ఇది చదివేయండి.
పనిచేయని గ్యాడ్జెట్లను అమ్మేయవచ్చు : ప్రస్తుతం ఈ-వేస్ట్‌ను కొనుగోలు చేసే పలు సంస్థలున్నాయి. వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఇంటి చిరునామా ఇస్తే చాలు వాళ్లే ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు స్థితిని బట్టి డబ్బును చెల్లిస్తారు. ఆయా ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయకపోయినా అందులోని భాగాలను రీ సైకిల్ చేసుకోవచ్చు. అవి కొత్త వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఇతర ప్లాస్టిక్, మెటల్ పరికరాలను రీసైకిల్ చేస్తారు.
సేకరించని ఈ-వేస్ట్ 57 శాతం : దేశంలో 2023-24లో సుమారు 57 శాతం ఈ-వేస్ట్ సేకరించలేదని ఓ సర్వేలో తేలింది. ఇది 9.9 లక్షల మెట్రిక్ టన్నులతో సమానం. వాటిని సేకరించని కారణంగా రీ సైక్లింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొత్త ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఏర్పడుతోంది. ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలు అనేకం ఉన్నాయి. అందులో ఎన్‌విరోకేర్, క్యాషిఫై, జోలోపిక్, ఐటీపికప్, రీసెల్‌ఫోన్. వెబ్‌సైట్‌లోకి వెళ్లి అమ్మేయాలనుకుంటున్న వస్తువు వివరాలను, చిరునామాను ఎంటర్ చేయాలి. వాళ్లకు రిక్వెస్ట్ వెళ్లగానే మనల్ని సంప్రదిస్తారు.
అన్నింటికీ ఒకటే ఛార్జర్.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా భారత్ అడుగులు!
'530 కోట్ల ఫోన్లు పక్కన పడేస్తారు.. రీసైక్లింగ్‌కు కొన్నే'.. WEEE నివేదిక