Chhaava Telugu Version : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు దేశవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.150+ కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఛావా' రెస్పాన్స్ అదిరిపోతోంది. కానీ, ఈ సినిమాను మేకర్స్ కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి సినిమా ఏదైనా, హీరో ఎవరైనా కథ బాగుంటే ఆదరించడంలో తెలుగు అభిమానులు ఎల్లప్పుడూ ముందుంటారు. 'కేజీఎఫ్', 'కాంతారా' లాంటి సినిమాలతో ఇది గతంలో నిరూపితమైంది. కథలో బలం ఉంటే టాలీవుడ్ ఆడియెన్స్ లాంగ్వేజ్ బౌండరీలు దాటి మరీ సినిమాను ఆదరిస్తారు. తాజాగా 'ఛావా' విషయంలోనూ అదే జరుగుతోంది. రీలీజైన రోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది.
అయితే చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఇలాంటి కథలను పాన్ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తే, కలెక్షన్లు కూడా బాగా పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల 'ఛావా' లాంగ్ రన్ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
Huge Demand for #Chhaava to be released in Telugu. 💥💥💥 pic.twitter.com/g3TQtX14XN
— Nishit Shaw (@NishitShawHere) February 19, 2025
A vision that became Hindavi Swarajya, a legend who forged an empire, a legacy that lives forever! 💫
— Maddockfilms (@MaddockFilms) February 19, 2025
राजे, तुम्ही होते, आहात, आणि सदैव राहणार - छत्रपती शिवाजी महाराज की जय। 🙏 pic.twitter.com/jLO0QPl1cd
కాగా, విక్కీ కౌశల్ ఈ సినిమాలో శంభాజీగా కనిపించారు. రష్మిక మంధన్నా యేసుబాయిగా ఆకట్టుకున్నారు. జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
Chhaava OTT : ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నతరుణంలో ఓటీటీ రిలీజ్ ముందుగా అనుకున్నదాని కంటే కాస్త ఆలస్యం కావొచ్చు. అంటే మార్చి చివరి లేదా ఏప్రిల్ తొలి వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
విక్కీ కౌశల్ 'ఛావా' రివ్యూ- హిస్టారికల్ ఫిల్మ్ ఎలా ఉందంటే?