Harassment by Girl Family Members : ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు వేధింపులు భరించలేని ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ ఇమ్రాన్ అనే యువకుడు తన చావుకు ప్రేమించిన యువతి తండ్రే కారణమంటూ ఓ నోట్ రాసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే : పాత బస్తీలోని ఖలన్దర్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(22), చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి(20) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం యువతి తండ్రికి తెలిసింది. గత మూడు రోజుల కింద అతను ఈ విషయంపై ఆలోచించి ఇమ్రాన్ ఇంటికి వెళ్లి మాట్లాడి కొద్ది రోజుల తర్వాత పెళ్లి విషయంపై చర్చిద్దామని చెప్పి వెళ్లిపోయాడు.
ఆమెతోనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు : తిరిగి ఫిబ్రవరి 14న శుక్రవారం అబిద్‌అలీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్ తమ కూతురును వేధిస్తున్నాడని ఆమెతోనే ఫిర్యాదు ఇప్పించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇమ్రాన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి అలా చేయవద్దని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఇమ్రాన్ ఇంటికి వచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నోట్ రాసి మరీ పెట్టాడు : తన మృతికి ప్రేమించిన యువతి కుటుంబీకులు, ముఖ్యంగా ఆమె తండ్రి ప్రధాన కారకుడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ నోట్ రాసి పెట్టాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
హనుమకొండ జిల్లాలోని గోపాల్‌పూర్‌లో దారుణం - భరత్ అనే యువకుడి గొంతుకోసిన ఓ బాలిక తండ్రి