ETV Bharat / offbeat

అల్లం పొట్టు తీయడం ఇబ్బందిగా ఉందా? - ఈ టిప్స్​తో సులువుగా వచ్చేస్తుంది! చేతులూ నొప్పెట్టవు! - SIMPLE TIPS TO PEEL GINGER

చేతులూ నొప్పెట్టకుండా అల్లం పొట్టు తీసుకునే సింపుల్​ టిప్స్!

Simple Tips to Peel Ginger
Simple ginger peeling (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 3:44 PM IST

Simple Tips to Peel Ginger : మనం రోజూ చేసుకొనే కూరలు, మాంసాహార వంటకాల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్​ని తప్పకుండా వేస్తుంటాం. అది వేయనిదే వాటి తయారీ పూర్తి కాదని చెప్పుకోవచ్చు. నిజానికి వంటకాలకు మంచి రుచిని అందించడంలో అల్లం వెల్లుల్లి తర్వాతే ఏదైనా అని చెప్పచ్చు. అలాగని రోజూ దీన్ని తయారుచేసుకోవడం పెద్ద పని. అందుకే చాలా మంది ఎక్కువ మొత్తంలో దీన్ని తయారు చేసుకొని నిల్వ చేసుకుంటారు.

అయితే, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునే క్రమంలో చాలా మంది అల్లంపై పొట్టు తీసేందుకు ఇబ్బందిపడుతుంటారు. ఎందుకంటే ఈ పొట్టు అతుక్కొని ఉండడం వల్ల తొలగించడం కాస్త చికాకు కలిగిస్తుంది. అలాగే, కొందరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఆ టైమ్​లోనూ అల్లం పొట్టు అంత సులభంగా రాదు. మీరూ అల్లంపై పొట్టు తీయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్​ ఫాలో అయ్యారంటే అల్లం పొట్టు సులువుగా వచ్చేస్తుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

అల్లం ఎంత శుభ్రంగా ఉన్నా సరే ఎక్కడ మట్టి, ఇసుక ఉంటాయో అన్న అనుమానంతో దానిపై ఉండే పొట్టుని వలుస్తుంటాం. ముఖ్యంగా వంటకు వాడే ముందు ఎక్కువ మందికి తొక్క తీసేయడం అలవాటు. ఈ క్రమంలోనే చాలా మంది పొట్టుని తీయడానికి సాధారణంగా చేతి గోళ్లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాకాకుండా అల్లం పొట్టు తీయడానికి ముందు కాసేపు వాటర్​లో నానబెట్టి ఆపై చెంచాతో తీస్తే పొట్టూ సులువుగా వచ్చేస్తుందంటున్నారు నిపుణులు. చేతులూ నొప్పెట్టవని చెబుతున్నారు.

  • కొందరు అల్లం పొట్టు తీయడానికి కత్తిని వాడుతుంటారు. కానీ, దానితో తొక్క తీస్తే సగం అల్లం తొక్కతోనే వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, అల్లం పై పొట్టు తొలగించడానికి చెంచా ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు.
  • అదేవిధంగా, పొట్టు తీయడానికి ముందు కాసేపు అల్లాన్ని వేడి నీళ్లలో నానబెట్టండి. ఆ తర్వాత చేతితో తీసినా అల్లం తొక్క సులువుగా వచ్చేస్తుందట.
  • ఈ టిప్ ద్వారా కూడా అల్లం పొట్టు ఈజీగా వచ్చేస్తుందంటున్నారు నిపుణులు. అదేంటంటే, వంటలో వాడడానికి 30 నిమిషాల ముందు అల్లంను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా అల్లం పై పొట్టు స్మూత్​గా మారుతుంది. ఆ తర్వాత చాకు లేదా చెంచా సహాయంతో పొట్టును ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు.
  • అంతేకాకుండా, మార్కెట్లో అల్లం పొట్టు తీయడానికి జింజర్ పీలర్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చేతి బొటనవేలికి తేలిగ్గా అమర్చుకోవచ్చు. గోళ్లు నొప్పి లేకుండా ఆ పరికరాల ద్వారా అల్లం పైన ఉండే పొట్టును సింపుల్​గా తొలగించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

ఉల్లిపాయలు ఇలా కట్​ చేయండి.. గిన్నెలు అలా కడగండి - ఈ సూపర్ టిప్స్ తెలుసా?

మిక్సీ అడుగు భాగం నల్లగా మారిందా? - ఈ టిప్స్​ పాటిస్తే క్షణాల్లో కొత్తదానిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.