ETV Bharat / offbeat

పుదీనాతో పచ్చడి రొటీన్ - ఓసారి ఇలా "కారం పొడి" చేసుకోండి! - టేస్ట్ అదుర్స్! - PUDINA KARAM PODI

అన్నం, టిఫెన్స్​లోకి అద్దిరిపోయే కారం పొడి - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

Pudina Karam Podi
Pudina Karam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 9:06 PM IST

Pudina Karam Podi in Telugu : కొంతమందికి ఎన్నెన్ని కూరలు ఉన్నా కారప్పొడులను చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది నువ్వులకారం, పల్లీపొడి, పుట్నాలకారం, కొబ్బరికారం, కందిపొడి, నల్లకారం, కరివేపాకపొడి ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారు. వీటిని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి దట్టించి తింటుంటే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఎప్పుడూ అవే కాకుండా వేసవిలో పోషకాలతో పాటూ శరీరానికి చల్లదనాన్నీ అందించే పుదీనాతో ఒకసారి కారం పొడి చేసుకోండి. ఇది పచ్చడిలానే ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంతో టిఫెన్స్​లోకి ఈ కారం పొడి సూపర్​గా ఉంటుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ! మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ కారం పొడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పుదీనా - 5 కప్పులు
  • పల్లీలు - పావు కప్పు
  • నువ్వులు - కప్పు
  • జీలకర్ర - రెండు చెంచాలు
  • ధనియాలు - రెండు టేబుల్‌ స్పూన్లు
  • చింతపండు - నిమ్మకాయంత
  • వెల్లుల్లి - అరపాయ
  • ఎండు మిర్చి - 20
  • నూనె - 2 చెంచాలు
  • ఉప్పు - రుచికి సరిపడా

టిఫెన్స్​లోకి పల్లీ చట్నీ కామన్​ - ఓసారి "కరివేపాకు కారం పొడి" ట్రై చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పుదీనాను 5 కప్పుల పరిమాణంలో కాడల నుంచి తుంచుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్​లోకి తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వడకట్టి తడిపోయేలా ఫ్యాన్ కింద క్లాత్​పై పరచి కాసేపు ఆరబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలను లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్​లో నువ్వులు, ధనియాలు, జీలకర్రలను వేరువేరుగా వేయించి ఒక ప్లేట్​లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఎండుమిర్చిని వేసి మంచిగా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత అందులోనే వాటర్ పడకట్టి ఆరబెట్టుకున్న పుదీనాను వేసి పచ్చిదనం పోయి కాస్త డ్రైగా అయ్యేంత వరకు వేయించాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి చల్లార్చుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆపై అందులో వేయించి చల్లార్చుకున్న పుదీనా, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండును యాడ్ చేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "పుదీనా కారం పొడి" రెడీ!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.

కొలెస్ట్రాల్​ను కరిగించే "ఉలవల కారం పొడి" - వేడి వేడి అన్నంలోకి తింటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.