10th Class Girl Dies of Heart Attack : ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలికి వయసుతో సంబంధం లేకుండానే గుండెపోటు విజృంభిస్తోంది. బడికి వెళ్లే పిల్లలు కూడా హార్ట్ఎటాక్ బారిన పడుతున్నాడు. తాజాగా కామారెడ్డి జిల్లాలో పదో విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. పాఠశాల యాజమాన్యం స్పందించి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన సరే ఆమెను బతికించలేకపోయారు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని చదువు నిమిత్తం కామారెడ్డిలోని కల్కినగర్‌లో ఉంటుంది. తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఎప్పుడూ వెళ్లినట్లే గురువారం ఉదయం పాఠశాలకు బయలుదేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ విషయం గుర్తించిన తోటి విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి తెలపడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయిందని ఆసుపత్రి వైద్యులు, పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ ఘటన కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
గోల్డెన్ అవర్ లోనే ఇంజక్షన్ : హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి వెంటనే సీపీఆర్ మొదలు పెట్టి, ఇతరులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలి. అది వచ్చేలోగా సీపీఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి టెనెక్ట్‌ప్లేస్ ఇంజక్షన్ ఇస్తే ప్రాణాలు నిలుస్తాయి. కానీ ఇదంతా కేవలం గంట లోలే జరిగిపోపాలి. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను "గోల్డెన్ అవర్" అంటారు. ఈ ఇంజక్షన్ కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు. ఈ ఇంజక్షన్ చేసిన తర్వాత చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం చాలా వరకు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ గుండెపోటు రాకుండా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం, సరైన ఆహారం, కంటి నిండా నిద్ర చాలా అవసరం.
24 గంటల్లో మరో లాయర్ మృతి - చలాన్ కట్టేందుకు వచ్చిన సమయంలో గుండెపోటు
గుండెపోటు రాగానే రూ.40వేల ఇంజక్షన్ ఇవ్వాలి - అది ఇప్పుడు పూర్తి ఉచితం!