Poonam Pandey Harrassed : బాలీవుడ్ నటి పూనమ్ పాండే వింత చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చుట్టూ కాంట్రవర్సీలు కూడా ఎక్కువే. అలాంటి నటికి తాజాగా ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెకు ముద్దుపెట్టబోయాడు. దీంతో షాక్‌కు గురైన పూనమ్ అతడిని పక్కకు నెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
పూనమ్ తాజాగా ముంబయి నగర వీధుల్లో తిరిగారు. ఈ సమయంలోనే ఓ అభిమాని సెల్ఫీ కోసం తన దగ్గరికి వచ్చాడు. సెల్ఫీకి పూనమ్ అంగీకరించారు. అయితే ఫొటో తీసుకుంటున్న క్రమంలో సదరు అభిమాని ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అభిమాని చర్యలకు పూనమ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెతోపాటు, అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు వెంటనే ఆతడిని పక్కకు నెట్టేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదంతా ప్లానేనా?
సదరు వ్యక్తిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పబ్లిక్‌గా ఆమెతో అలా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. ఇవేం పిచ్చి పనులు అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన డ్రామా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పూనమ్‌కు ఇలా కాంట్రవర్సీ స్టంట్స్ క్రియేట్ చేయడం ఇదేం కొత్త కాదని అంటున్నారు. ఇదివరకు కూడా ఆమె చాలాసార్లు ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసిందని గుర్తుచేస్తున్నారు. అయితే గతేడాది ఆమె ఏకంగా తాను మరణించినట్లు నకిలీ వార్తలను ప్రచారం చేశారు. దీంతో ఇది కూడా అలాంటిదే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది ఇంకా తెలియరాలేదు.