Kangana Ranaut Emergency OTT Release : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. చాలా సార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా రీసెంట్గా జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ఫ్లిక్ వేదికగా ఇది అందుబాటులోకి రానుందని కంగన తాజాగా అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా 'ఎమర్జెన్సీ' ఓటీటీ రిలీజ్ డేట్‌ను చెప్పుకొచ్చారు. మార్చి 17 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
సినిమా విషయానికి వస్తే,
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనౌన్స్ చేసిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని సిద్ధం చేశారు. కంగన డైరెక్టర్‌గానే కాకుండా ఈ చిత్ర నిర్మాతగానూ వ్యవహరించారు.
ఇందులో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ రోల్లో యంగ్ హీరో హీరో శ్రేయస్ తల్పడే కనిపించారు. వారితో పాటు భూమికా చావ్లా, మిలింద్ సొమన్, మహిమా చౌదరి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరిశారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.21 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించినట్లు అంచనా.
గత సినిమాల ఓపెనింగ్స్
2023లో వచ్చిన కంగనా రనౌత్ మూవీ 'తేజస్' ఓపెనింగ్ రోజు రూ.1.25 కోట్లు వసూల్ చేసింది. అలానే 2022లో ఆమె నటించిన 'ధాకడ్' మూవీ ఫస్ట్ డే రూ.1.2 కోట్లకు పరిమితం అయ్యింది. ఇక 2021లో రిలీజైన పొలిటికల్ డ్రామా 'తలైవి' మొదటి రోజు రూ.1.46 కోట్లు సంపాదించింది. ఈ చిత్రంలో కంగన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించారు. అయితే కరోనాకి ముందు, కంగనా నటించిన 'పంగా (2020)' ఏకంగా రూ.2.70 కోట్ల ఓపెనింగ్ సాధించింది.
కంగన 'ఎమర్జెన్సీ' సెన్సార్- ఆ కండీషన్స్‌కు మేకర్స్ ఓకే! - Kanagana Ranaut Emergency