ETV Bharat / state

జులై నాటికి హైదరాబాద్​లోని ఆ 6​ చెరువుల సుందరీకరణ - హైడ్రా ప్రణాళిక - HYDRA FOCUS ON REVIVAL OF PONDS

హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్దరణపై హైడ్రా ఫోకస్ - 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలు - జులై నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యం

Hydra Focus On Revival Of Ponds In Hyderabad
Hydra Focus On Revival Of Ponds In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 9:54 PM IST

Hydra Focus On Revival Of Ponds In Hyderabad : హైదరాబాద్‌లో చెరువుల పునరుద్దరణలో హైడ్రా మరో ముందడుగు వేసింది. తొలి దశలో నగరంలోని 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 150 నుంచి 200 కోట్లతో ఆ చెరువులను సమీప ప్రజలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన హైడ్రా జులై నాటికి పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తోంది.

హైదరాబాద్‌లో కబ్జాకోరల్లో చిక్కుకున్న చెరువులను విడిపిస్తోన్న హైడ్రా వాటి పునరుద్దరణకి పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు 12 చెరువులను గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో 6 చెరువులకు సంబంధించి ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలను తొలగించిన హైడ్రా వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు పనులు మొదలుపెట్టింది. అంబర్‌పేట బతుకమ్మకుంట, శాస్త్రిపురంలోని బుమ్‌రుక్‌దౌలా, మాదాపూర్ తమ్మిడుకుంట, గుట్టలబేగంపేటలో సున్నంచెరువు, కూకట్​పల్లి, ఉప్పల్‌లోని చెరువులు అభివృద్ధి చేయనుంది.

3డీ విజువల్స్, ఫొటోలు విడుదల : ఇప్పటికే ఉప్పల్‌లోని నల్లచెరువులో హైడ్రా పనులు ప్రారంభించింది. సుమారు 150 నుంచి 200 కోట్ల ప్రభుత్వ నిధులతో పునర్జీవం కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ చెరువులకు సంబంధించిన పూర్తి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్​ఎండీఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఆరు చెరువులకు సంబంధించిన 3డీ విజువల్స్, ఫొటోలను విడుదల చేశారు.

బతుకమ్మకుంటలో లోతు తవ్వగానే నీరు : కూకట్‌పల్లి నల్లచెరువులో చెత్తాచెదారం తొలగించగా ఉప్పల్ నల్లచెరువులో ఉన్న నీటిని బయటికి వదులుతున్నారు. అంబర్​పేట బతుకమ్మకుంటలో జేసీబీలతో పూడిక తీత మొదలుపెట్టగా మోకాలు లోతు తవ్వగానే నీరు ఉబికిరావడం స్థానికులతో పాటు హైడ్రా అధికారులు ఆశ్చర్యపోయారు. మొదట పైపులైన్ పగిలిందని అనుమానాలు రావడంతో జలమండలి అధికారులు బతుకమ్మకుంటకు చేరుకొని పరిశీలించారు. ఆ నీరంతా భూగర్భ జలమేనని, ఎలాంటి పైపులైన్లు పగలలేదని నిర్ధారించారు.

జులై నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం : హైడ్రా ఎంపిక చేసిన ఆ ఆరు చెరువుల పునరుద్దరణలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్స్, జిమ్, పిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లతో పాటు చుట్టూ ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా తీర్చిదిద్దనున్నారు. జులై నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా హైడ్రా పని చేస్తోంది.

బతుకమ్మకుంట బతికే ఉంది - హైడ్రా మోకాల్లోతు తవ్వగానే ఉప్పొంగిన పాతాళగంగ

చెరువుల పరిరక్షణకు హైడ్రా పిలుపు - ఈ నంబర్​కు ఫోన్​, వాట్సప్​ చేస్తే చాలు

హైడ్రా అలర్ట్ : అక్కడ ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దు : ప్రజలకు రంగనాథ్ కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.