Telangana EAPCET 2025 Notification Released : తెలంగాణ ఎప్‌సెట్ దరఖాస్తులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన విడుదల చేసింది. కాగా మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్ షెడ్యూల్ ఖరారైంది. సెట్ నిర్వహణపై సమావేశం నిర్వహించిన తర్వాత జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా షెడ్యూల్‌ను ప్రకటించాయి. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష - సిలబస్‌పై కీలక ప్రకటన