ETV Bharat / technology

గగన్​యాన్​తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్​ లాంఛ్- షెడ్యూల్ ఇదే! - ISRO CHAIRMAN ON GAGANYAAN MISSION

'గగన్​యాన్ మా తక్షణ ప్రాధాన్యత'- మిషన్​పై కీలక విషయాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్!

ISRO Chairman V Narayanan during an interview with ETV Bharat
ISRO Chairman V Narayanan during an interview with ETV Bharat (Photo Credit- ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 16, 2025, 4:00 PM IST

ISRO Chairman on Gaganyaan Mission: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. భారత్‌ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్​పై కీలక విషయాలను ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్ పూర్తి చేయడమే ఇస్రో తక్షణ కర్తవ్యం అని ఈవీటీ భారత్​కు చెందిన అనుభా జైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గగన్​యాన్ మిషన్​ను 2026లో లాంఛ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా మొదట మానవరహిత (మనుషులు లేని) మిషన్​ను ఈ ఏడాది లాంఛ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో వ్యోమిత్ర రోబోట్​ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఈ మానవసహిత (మనుషులు ఉన్న) అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్‌యాన్​పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ మిషన్​లో సవాళ్లను, వాటిని ఎదుర్కొనేందుకు అంతరిక్ష సంస్థ చేస్తున్న ఏర్పాట్లపై ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్​ కోసం ఇస్రో ముందుగా మొత్తం మూడు మానవరహిత టెస్ట్ ఫ్లైట్​లను ప్రారంభిస్తుందని తెలిపారు. మానవరహిత ఫ్లైట్​ టెస్టింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మానవసహిత మిషన్​కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి ఫ్లైట్​ ఈ ఏడాది శ్రీహరికోట నుంచి లాంఛ్ చేసేందుకు షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.

ఈ గగన్​యాన్ మిషన్​ ద్వారా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ భూమి అత్యల్ప కక్ష్య (LEO) కు పంపించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇందుకోసం ఈ మిషన్​ హ్యూమన్-రేటెడ్ LVM 3 వెహికల్​ (HLVM 3)ను ఉపయోగించుకుంటుందని అన్నారు. ఈ వెహికల్ అడ్వాన్స్‌డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ మార్జిన్​లతో పాటు విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఇం​క్రీజ్డ్ రిడెండెన్సీని కలిగి ఉంటుందని వివరించారు. దీంతోపాటు ఇందులో రియల్​-టైమ్ వెహికల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, సిబ్బంది భద్రత కోసం ఆర్బిటల్ మాడ్యూల్ సిస్టమ్​, అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ సేఫ్టీ సిస్టమ్ వంటివి ఉన్నాయని తెలిపారు.

ఈ వెహికల్ వ్యోమగాములను మొదట 170కి.మీ, ఆ తర్వాత అక్కడి నుంచి 400కి.మీ భూమి అత్యల్ప కక్ష్య వరకు తీసుకుని వెళ్తుందని వెల్లడించారు. ఈ విధంగా కక్ష్యను మెయింటెన్ చేస్తూ ఆ తర్వాత వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి చేరుస్తుందని ఇస్రో ఛైర్మన్ వివరించారు.

ఈ మిషన్​లో భాగంగా ఇది సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆరోహణ, అవరోహణ రెండింటినీ నిర్వహిస్తుందని అన్నారు. ఇది రీ-ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గిస్తుందని, ఆ తర్వాత పారాచూట్ సహాయంతో దీని ల్యాండింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మిషన్​ కోసం పారాచూట్​లను DRDO సహాయంతో ఆగ్రాలో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

అడ్వాన్స్‌డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ మార్జిన్స్ అంటే?: అడ్వాన్స్‌డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని వ్యోమగాముల భద్రతలో సహాయపడతాయి. అంటే అధిక వేగంతో ఒక వస్తువు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు అది గణనీయమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుని వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు ఇస్రో ఈ అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అండ్ టెర్మినల్ ప్రొటెక్షన్ సిస్టమ్​​ను అభివృద్ధి చేసింది. అనంతరం అంటే చివరి దశలో ఈ స్పేస్​క్రాఫ్ట్​ను పారాచూట్‌లను ఉపయోగించి ఖచ్చితమైన, నియంత్రిత వేగానికి నెమ్మదించి ల్యాండింగ్ చేయనున్నారు.

ఇంక్రీజ్డ్ రిడెండెన్సీ అంటే ఏంటి?: ఇంక్రీజ్డ్ రిడెండెన్సీ అంటే ఒక వ్యవస్థ విఫలమైతే అప్పుడు దాని బ్యాకప్ వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది.

మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే?: గగన్‌యాన్ మిషన్‌లో సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది స్పేస్​ క్రాఫ్ట్​ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకునిరావడంలో ఉపయోగపడుతుంది. అంటే అంతరిక్ష నౌక భూ వాతావరణానికి తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రొపల్షన్ సిస్టమ్ దాని వేగాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత పారాచూట్ సాయంతో ఈ స్పేస్​క్రాఫ్ట్​ను నెమ్మదిగా సేఫ్ ల్యాండింగ్ చేయనున్నారు.

ఈ విధంగా మానవసహిత (మనుషులు ఉన్న) అంతరిక్ష యాత్ర గగన్‌యాన్​ మిషన్​లో సవాళ్లను పరిష్కరించి వాటిని ఎదుర్కొనేందుకు ఇస్రో చేస్తున్న పగడ్బందీ ఏర్పాట్లపై నారాయణన్ వివరించారు. దీంతోపాటు ఈ గగన్​యాన్ మిషన్ తర్వాత తక్కువ ఖర్చుతో కూడిన అంతరిక్ష ప్రయాణంపై ఇస్రో దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. అంటే ఇస్రో అటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రాకెట్లను అభివృద్ధి చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తక్కువ ఖర్చుతో స్పేస్​క్రాఫ్ట్​లను లేదా ఆస్ట్రానాట్స్​ను అంతరిక్షంలోకి పంపించొచ్చని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష సంస్థ ఇప్పటికే లూనార్ పోలార్ ఎక్స్​ప్లోరేషన్ మిషన్ (LUPEX)తో సహా అనేక మిషన్​లకు ఆమోదం పొందినట్లు నారాయణన్ తెలిపారు. ఇస్రోకు ఇది ఒక ప్రత్యేక మిషన్​ అని, ఇది చంద్రయాన్-3 గణనీయమైన మెరుగుదలగా అభివర్ణించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​ను జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు నారాయణన్ తెలిపారు.

ఏంటీ LUPEX మిషన్?: లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (LUPEX) అనేది చంద్రుని ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి భారత్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేపట్టిన ఉమ్మడి మిషన్. ఇది చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించి, భవిష్యత్తులో చంద్రుని అన్వేషణకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇలా ఈ మిషన్ చంద్రునిపై మన అవగాహనను మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో LUPEX మిషన్ శాస్త్రీయ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగును సూచిస్తుందని నారాయణన్ అన్నారు.

మరోసారి చంద్రుడిపైకి వెళదామా?- చంద్రయాన్-4పై క్లారిటీ వచ్చిందిగా!

చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం

సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.