ETV Bharat / offbeat

ఎప్పుడూ తినని రుచితో కమ్మని "ఉల్లిపాయ పచ్చడి" - అన్నం, టిఫెన్స్​లోకి సూపర్ కాంబో! - ULLIPAYA PACHADI RECIPE

- ఇంట్లో కూరగాయలు లేనప్పుడు క్షణాల్లో రెసిపీ రెడీ - ఇలా చేసి పెడితే ఎవరైనా దిల్​ఖుష్ అవ్వాల్సిందే!

Ullipaya Pachadi Recipe
Ullipaya Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 7:39 PM IST

Ullipaya Pachadi Recipe in Telugu : కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. కేవలం ఉల్లిపాయలు మాత్రమే ఉంటుంటాయి. అలాంటి టైమ్​లో ఏం కర్రీ చేసుకోవాలని ఆలోచించకుండా ఓసారి ఇలా "ఉల్లిపాయ పచ్చడి"ని ట్రై చేయండి. రుచి అదుర్స్ అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ నెక్ట్ లెవల్! కేవలం అన్నంలోకే కాదు టిఫెన్స్​లోకి అద్భుతంగా ఉంటుంది ఈ చట్నీ. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయలు - 3 (మీడియం సైజ్​వి)
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • మెంతులు - చిటికెడు
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • మినప్పప్పు - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీ స్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • ఎండుమిర్చి - 9
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - పావుటీస్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • జీలకర్ర - పావుటీస్పూన్
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - పావుటీస్పూన్

ఘుమఘుమల "టమాట పండుమిర్చి పచ్చడి" - ఇలా చేస్తే అమృతమే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసుకొని కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఒక చిన్న బౌల్​లో చింతపండుని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • అవి చక్కగా వేగాక మీ కారానికి తగినన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఎండుమిర్చి లైట్​గా వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ ఆనియన్స్ రంగు మారి, కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. ఆపై అందులోనే నానబెట్టుకున్న చింతపండుని వాటర్​తో సహా వేసుకోవాలి. అలాగే, ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటమనే వరకు వేయించుకోవాలి.
  • అవి వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపుని లో ఫ్లేమ్​ మీద చక్కగా వేగనివ్వాలి.
  • చివర్లో పసుపు వేసి కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై సన్నని సెగ కాసేపు మగ్గించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "ఉల్లిపాయ పచ్చడి" రెడీ!
  • ఇది బయట ఉంచితే కనీసం రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిజ్​లో స్టోర్ చేస్తే వారం పాటు ఫ్రెష్​గా ఉంటుంది!

"తోటకూర టమాటా పచ్చడి" - చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.