New Animation Courses In JNAFAU College : ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథ, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ రంగాల్లో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తుంది. దీంతో యానిమేషన్, గ్రాఫిక్స్ డిజైన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. అందుకే ప్రస్తుత, భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అనుమతితో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి. గంగాధర్ అన్నారు. జేఎన్‌ఏఎఫ్ విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.
యానిమేషన్, గ్రాఫిక్స్ విభాగాల్లో రూ.లక్షల్లో జీతాలు : యానిమేషన్, గ్రాఫిక్స్ విభాగాల్లో నైపుణ్యమున్న ఇంజినీర్లకు రూ.లక్షల్లో పారితోషికాలు లభిస్తున్నాయి. సరైన సంఖ్యలో నిపుణులు లేక ఇంజినీరింగ్ విద్యార్థులు, ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేసిన ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త కోర్సుల సిలబస్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. శిల్పకళల కోసం ప్రత్యేకంగా స్టుడియోను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వర్సిటీలోని శిల్పాలు, విగ్రహాల తయారీ విభాగాన్ని బలోపేతం చేస్తామని జేఎన్‌ఏఎఫ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి. గంగాధర్ అన్నారు.
భిన్నమైన శైలిలో నిర్మాణాలు : ఈ రోజుల్లో ఇళ్ల నిర్మించుకునేవారు భిన్నమైన శైలిని కోరుకుంటున్నారు. ఇంటి బయట, లోపల చూడముచ్చటైన ఇంటీరియర్స్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీనికోసం ఆర్కిటెక్చర్ ఇంజినీర్లు వేటికవే భిన్నమైన ఆకృతులను ఇస్తున్నా, ఇంకా మంచివి కావాలని అంటున్నారు. అందుకే ఆర్కిటెక్చర్‌లో కృత్రిమమేథను వినియోగించి నాణ్యమైన, కళాత్మకమైన డిజైన్లను రూపొందించనున్నారు. ఆటోక్యాడ్ ద్వారా ఇప్పటికే కొత్త ఆకృతులు ఇస్తున్నారు.
మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అలా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు కావాలనుకుంటున్నారు. కొత్త ట్రెండ్ల గురించి తెలుసుకొని, వాటిని తమ ఇంట్లో చేయించుకుంటున్నారు. దీని కోసం రూ.లక్షలు ఖర్చుపెడుతున్నారు. గతంలో ఆర్కిటెక్చర్ నిర్మాణ ఆకృతులు వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకుని గీసేవారు. ఇప్పుడు యాభైఏళ్ల వరకూ డిజైన్ కొత్తగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.
"నాన్న ఇంజనీరింగ్ అంటుంటే - అమ్మ యానిమేషన్ అంటోంది - ఇంటర్ తర్వాత ఏం చేయాలి"?
ఆ 11 కోర్సులకు దేశంలో ఫుల్ డిమాండ్ - పట్టా పొందారంటే జాబ్ ఇట్టే వచ్చేస్తుంది!