ETV Bharat / entertainment

ఓటీటీలో మరింత లేట్​గా 'డాకు మహారాజ్‌'! - కారణం అదేనా? - DAAKU MAHARAAJ OTT

'డాకు మహారాజ్‌' ఓటీటీ వెర్షన్​ - మరింత ఆలస్యం - కారణం అదేనా?

Daaku Maharaaj OTT
Balakrishna Daaku Maharaaj (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2025, 5:17 PM IST

Daaku Maharaaj OTT : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు 'మహారాజ్​'. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో బాబీ దేఓల్‌, ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశి రౌటెల తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టోరీ, బాలయ్య యాక్షన్ ఇలా పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్​ హిట్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్​పై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.

ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా వచ్చిన సినిమాల్లో 'గేమ్‌ ఛేంజర్‌' ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మాత్రం ఓటీటీ కన్నా ముందే బుల్లితెరపైకి రానున్నట్లు తాజాగా జీ5 ప్రకటించింది. అయితే 'డాకు మహారాజ్‌' మాత్రం తమ ఓటీటీ స్ట్రీమింగ్​ గురించి ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఓటీటీ గురించి మూవీ టీమ్ ఎప్పుడు చెప్తారో అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే, మరికొన్నాళ్లకు ఆ ఎదురుచూపులు తప్పవంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ సంస్థ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారం కల్లా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. అయితే, చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రిలీజ్​ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయట.

ఇదిలా ఉండగా, కొన్ని థియేటర్స్‌లో 'డాకు మహారాజ్‌' ఇంకా ఆడుతోంది. దీంతో విడుదలైన రోజు నుంచి 50 రోజులు పూర్తైన తర్వాతే ఈ చిత్రాన్ని ఓటీటీకి తీసుకురావాలంటూ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నిబంధనను మూవీ టీమ్​ పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారట మేకర్స్. అయితే ప్రస్తుతం ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. అది కాస్త నెమ్మదిగా సాగుతుండటం వల్ల కూడా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఇంకాస్త ఆలస్యమైందని తెలుస్తోంది. అన్నీ పూర్తయితే, మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తెలుగులో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయగా, అక్కడ కూడా 'డాకు మహారాజ్​'కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

'ఏజ్​ చూసి బాలయ్య ఛాన్స్​లు ఇవ్వరు - ఆయనతో నన్ను స్క్రీన్​పై చూసుకుని షాకయ్యాను'

'ఆదివారం అలా చేస్తే నాకు డేంజర్'- బాలయ్య ​'సండే' సెంటిమెంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.