Telangana Tourism Arunachalam Package: తమిళనాడులోని ప్రసిద్ధ శైవ క్షేత్రం "అరుణాచలం". దీన్నే తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. పరమేశ్వరుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది అరుణాచలేశ్వరుడి దర్శించుకోవడానికి వెళ్తుంటారు. మరి మీరు కూడా అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, తెలంగాణ టూరిజం మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది. భాగ్యనగరం నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం హైదరాబాద్ - అరుణాచలం పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 4 రోజులు సాగుతుంది. ఈ టూర్లో అరుణాచలేశ్వర టెంపుల్‌తో పాటు వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం కవర్ అవుతాయి. రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ ఉంటుంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది.
ప్రయాణం ఎలా ఉంటుందంటే:
- మొదటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడ TTDC ఆలయం హోటల్లో చెకిన్ అవుతారు. లంచ్ తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం ఉంటుంది. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
- మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి స్టార్ట్ అవుతారు. మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. లంచ్ తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. దర్శనం అనంతరం రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- నాలుగో రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ టూర్ పూర్తవుతుంది.
టూర్ ధరల వివరాలు :
- తెలంగాణ టూరిజం ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ టూర్లో పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,400గా టికెట్ ధరలు నిర్ణయించారు.
- టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్ అకామడేషన్ కవర్ అవుతాయి. ఇక ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనాల ఏర్పాట్లు పర్యాటకులే సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం ఈ టూర్ మార్చి 11వ తేదీన అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కేవలం రూ.380కే హైదరాబాద్ సిటీ టూర్ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!