GT Women vs RCB Women : 2025 మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. రిచా ఘోష్ (64* పరుగులు) సూపర్ ఇన్నింగ్స్‌తో రఫ్పాడించింది. కనికా అహుజ (30* పరుగులు) రాణించింది. కెప్టెన్ ఎల్లిస్ పెర్రీ (57 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. గుజరాత్ బౌలర్లలో గార్డనర్ 2, డాటిన్, సట్గరె తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఓపెనర్ బెత్ మూనీ (56 పరుగులు) బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మరో ఓపెనర్ లారా వాల్వార్ట్ (6 పరుగులు), హేమలత (4 పరుగులు) విఫలమయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ గార్డ్నర్ (79 పరుగులు, 37 బంతుల్లో; 3x4, 8x4) సిక్సర్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.
ఇక చివర్లో డియెండ్ డాటిన్ (25 పరుగులు) 3 ఫోర్లు, 1 సిక్స్ కూడా ఆకట్టుకుంది. సిమ్రన్ (11 పరుగులు), హర్లీన్ (9 పరుగులు) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ 2, అహుజ, వేర్గమ్, ప్రేమ రావత్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
Stand up and applause 👏👏
— Women's Premier League (WPL) (@wplt20) February 14, 2025
Richa Ghosh with a cracking half-century 🔥
She has taken #RCB home with a stellar innings 🫡
Live 👉 https://t.co/jjI6oXJcBI #TATAWPL | #GGvRCB pic.twitter.com/i6PUZGB52I