Balakrishna Gift To Thaman : నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా మ్యాజిక్ డైరెక్టర్ తమన్‌కు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. తమన్ టాలెంట్‌ను అభినందిస్తూ ఆయన పోర్షే కారును గిఫ్ట్‌గా అందించారు. రీసెంట్గా బాలయ్య ఈ ఆ కారును తమన్‌కు అందజేశారు. కెరీర్లో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసి ఫ్యాన్స్ 'బాలయ్య మనసు బంగారం', 'ఆర్టిస్ట్‌లను, అలాగే టాలెంట్‌ను అభినందించడంలో బాలయ్య స్టైలే వేరు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
A bond beyond cinema! ❤️❤️#NandamuriBalakrishna garu gifted a grand Porsche car to our sensational @MusicThaman garu ❤️😍
— manabalayya.com (@manabalayya) February 15, 2025
Their bond keeps growing showing that respect and admiration go beyond movies 🫶🏻 pic.twitter.com/Hp8bk4QxQy
హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవ సందర్భంగా బాలయ్య తమన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తమన్ నాకు సోదరుడితో సమానం. వరుసగా నాలుగు హిట్లను అందించిన తమ్ముడికి నేను ప్రేమతో ఈ కారును బహుమతిగా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ఇద్దరి ప్రయాణం ఇలాగే కొనసాగుతోంది" అని అన్నారు.
మా డైరెక్టర్స్ అందరికి బోయపాటి గారికి, @megopichand గారికి,@AnilRavipudi గారికి,@dirbobby గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్న - బాలయ్య ❤️🥰
— manabalayya.com (@manabalayya) February 15, 2025
ఆ సినిమాలు అన్నిటికి ఎంతో అద్భుతమైన music ఇచ్చారు మా తమ్ముడు @MusicThaman గారు, మా ఇద్దరిది ఎంతో ప్రత్యేకమైన అనుబంధం - బాలయ్య ❤️💥… pic.twitter.com/PuaAsjB3MH
బాలయ్య, తమన్ కాంబోలో వచ్చిన సినిమాలు :
బాలయ్య, తమన్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరికి టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. బాలయ్య నటించిన 'డిక్టేటర్'తో ఈ ఇద్దరి ప్రయాణం ప్రారంభమవ్వగా, ఆ తర్వాత 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి'తో పాటు రీసెంట్గా సంక్రాంతి కానుకగా వచ్చిన 'డాకు మహారాజ్' వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది.
ముఖ్యంగా తమన్ 'అఖండ'కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, అలాగే సాంగ్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం బాలయ్య అప్‌కమింగ్ మూవీ 'అఖండ 2'కి కూడా తమన్ స్వరాలు అందిస్తున్నారు.
'నందమూరి కాదు, ఇకపై NBK తమన్'- బాలయ్య
ఇటీవలె సోషల్ మీడియాలో తమన్‌ను ఫ్యాన్స్ 'నందమూరి తమన్' సరదగా పిలుస్తున్నారు. అయితే దీనిపై 'డాకు మహారాజ్' సక్సెస్‌మీట్‌లో బాలయ్య స్పందించారు. ఇంతటి అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్‌ను ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ 'నందమూరి తమన్' అని పిలవడంపై ఆయన స్పందించారు. మ్యూజిక్ డైరెక్టర్‌కు కొత్త పేరు పెట్టారు.
'తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ అతని ఇంటి పేరు మార్చేశారు. ఎస్ ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని అంటున్నారు. కానీ, నందమూరి కూడా కాదు. ఈరోజు నుంచి తనకు 'NBK తమన్'. అని నామకరణం చేస్తున్నా (నవ్వుతూ)' అని బాలయ్య అన్నారు.
బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ! - శివరాత్రికి 'అఖండ 2' టీమ్ స్పెషల్ సర్ప్రైజ్
22ఏళ్ల తర్వాత లీడ్ రోల్లో తమన్- ఆ హీరోతో మల్టీస్టారర్ సినిమా కన్ఫార్మ్!