ETV Bharat / offbeat

సూపర్​ సాఫ్ట్​ "జొన్న ఇడ్లీలు" - డయాబెటిస్​ పేషెంట్లకు బెస్ట్​​ ఆప్షన్​ - టేస్ట్​ కూడా అదుర్స్​! - HOW TO MAKE JOWAR IDLI AT HOME

-ఇడ్లీరవ్వ లేకుండా జొన్నలతో సూపర్​ సాఫ్ట్​ ఇడ్లీలు -బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్​ పేషెంట్లకు బెస్ట్​ ఆప్షన్​

How to Make Jowar Idli at Home
How to Make Jowar Idli at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 10:35 AM IST

How to Make Jowar Idli at Home: బ్రేక్​ఫాస్ట్‌ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీనే. ఆరోగ్యానికి మంచిదనీ, తేలికగా ప్రిపేర్​ చేసుకోవచ్చని అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు ఇడ్లీనే చేస్తుంటారు. ఇక ఇడ్లీలు చేయాలంటే మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వ కూడా ఇంపార్టెంట్​. అయితే ఇడ్లీ రవ్వ లేకుండా కేవలం జొన్నలతో ఎంతో రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. జొన్నలతో చేసిన ఇవీ సూపర్​ సాఫ్ట్​గా వస్తాయి. పైగా బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్​ పేషెంట్లకు ఈ సూపర్​ ఛాయిస్​. మరి లేట్​ చేయకుండా జొన్న ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • జొన్నలు - 2 కప్పులు
  • మినపప్పు - అర కప్పు
  • మెంతులు - 1 టీ స్పూన్​
  • అటుకులు - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే ముందు రోజు రాత్రే పిండిని ప్రిపేర్​ చేసుకోవాలి. ఎందుకంటే పిండి పులిస్తేనే ఇడ్లీలు చాలా మృదువుగా, టేస్టీగా ఉంటాయి. కాబట్టి పిండిని ముందే సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్​లోకి మినపప్పు, మెంతులు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాత నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • మరో గిన్నెలోకి తెల్ల జొన్నలు వేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసుకుని 5 గంటలు నానబెట్టాలి.
  • పప్పు, జొన్నలు నానిన తర్వాత వీటిని గ్రైండ్​ చేసే 5 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకోవాలి. అందుకోసం ఓ గిన్నెలోకి అటుకులు వేసి ఓసారి కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టాలి.
  • 5 నిమిషాల తర్వాత మిక్సీజార్​ తీసుకుని అందులోకి మినపప్పు, అటుకులు వేసి గ్రైండ్​ చేయాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చాలా మెత్తగా రుబ్బుకోవాలి.
  • పిండి మెదిగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీజార్​లోకి కొద్దికొద్దిగా జొన్నలు వేసుకుంటూ రవ్వగా గ్రైండ్​ చేసుకోవాలి. ఇలా జొన్నలు మొత్తాన్ని గ్రైండ్​ చేసుకుని మినపప్పు గిన్నెలోకి తీసుకోండి.
  • ఆ తర్వాత మినపప్పు, జొన్నల మిశ్రమం పూర్తిగా కలిసేలా ఓ 5 నిమిషాల పాటు కలపి మూత పెట్టి రాత్రంతా పిండిని పులియబెట్టాలి.
  • మరుసటి రోజు ఉదయం పిండి పులిసి చక్కగా పొంగుతుంది. అప్పుడు పిండిని ఓసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి గ్లాసున్నర నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్​కు నూనె లేదా నెయ్యి అప్లై చేసి జొన్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్​లోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి.
  • ఇడ్లీ పాత్రలోని నీళ్లు మరుగుతున్నప్పుడు ప్లేట్స్​ పెట్టి మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్​లో ఉడికించాలి.
  • ఇడ్లీలు ఉడికిన 5 నిమిషాల తర్వాత తీసి ప్లేట్​లోకి సర్వ్​ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన జొన్న ఇడ్లీ రెడీ. దీనికి పల్లీ చట్నీ సూపర్​గా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

బంగాళదుంపతో సూపర్ టేస్టీ "ఇడ్లీలు" - పప్పు రుబ్బే పనిలేకుండా నిమిషాల్లో రెడీ!

పచ్చి బఠాణీలతో "ఇడ్లీలు, గుంట పొంగనాలు" - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.