KTR About KCR Meeting With BRS Leaders in Telangana Bhavan : తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్కి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.
వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం : బీఆర్‌ఎస్ రజతోత్సవం ప్రజా ఉత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పోరాటంలో ప్రాణ త్యాగాల గురించి గుర్తు చేసుకున్నామని అన్నారు. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ రజతోత్సవాలు ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, రజతోత్సవాల్లో ప్రజలను మమేకం చేసుకుంటూ వినూత్న కార్యక్రమాలు చేపడతామని, ఉత్సవాల నిర్వహణపై వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తామని తెలిపారు.
ప్రజల ప్రయోజనాల పరిరక్షణే మాకు ముఖ్యం : తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమని, కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలనేది ప్రజల ఆకాంక్షని, తమకు అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన లేదని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమకు ముఖ్యమని అన్నారు.
హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల భేటీ : పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలో తల్లడిల్లుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత తమపై ఉందని, తెలంగాణను బీఆర్‌ఎస్ అగ్రస్థానంలో నిలిపిందని, కాంగ్రెస్ ఏడాదిలోనే తెలంగాణను సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రజా పోరాటాలు, వివిధ వర్గాల సమస్యలను ముందుండి నడిపిస్తామని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించామని, ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల భేటీ ఉంటుందని తెలిపారు.
"బీఆర్‌ఎస్ రజతోత్సవం ప్రజా ఉత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగాల గురించి గుర్తు చేసుకున్నాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలో తల్లడిల్లుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. తెలంగాణను బీఆర్‌ఎస్ అగ్రస్థానంలో నిలిపింది. కాంగ్రెస్ ఏడాదిలోనే తెలంగాణను సంక్షోభంలోకి నెట్టింది."- కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ప్రజలకు నచ్చి కాంగ్రెస్ గెలవలేదు - మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తాం : కేసీఆర్