ETV Bharat / international

FBI డైరెక్టర్​గా కాశ్​ పటేల్​కు గ్రీన్ సిగ్నల్- అమెరికన్లకు హాని చేస్తే అంతు చూస్తానంటూ వార్నింగ్ - FBI DIRECTOR KASH PATEL

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్‌ నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదం-అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని తీర్చి కాశ్

FBI Director Kash Patel
FBI Director Kash Patel (Associated press)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 10:26 AM IST

Updated : Feb 21, 2025, 11:01 AM IST

FBI Director Kash Patel : అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్​బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకానికి సెనెట్‌ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. ఎఫ్​బీఐ డైరెక్టర్‌ పదవి చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

'ఎఫ్‌బీఐ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను నియమించడం ఎంతో గౌరవంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అటార్నీ జనరల్ పామ్‌ బోండికి నా కృతజ్ఞతలు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 9/11 దాడుల వరకు ఎఫ్​బీఐకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. రాజకీయంగా మారిన న్యాయవ్యవస్థ కారణంగా ఎఫ్​బీఐపై ప్రజల్లో విశ్వాసం పోయింది. ఈ రోజుతో అది ముగిసిపోయిన అధ్యాయం. దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉంది. దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం. అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే, వారి అంతు చూస్తాం' అని కాశ్ పేర్కొన్నారు.

ఎఫ్​బీఐ డైరెక్టర్​గా కాశ్​ పటేల్​ను ఆమోదించేందుకు సెనేట్ గురువారం ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 51 ఓట్లు రాగా, 49మంది వ్యతిరేకించారు. అయితే 49మందిలో ఇద్దరు రిపబ్లికన్ సనేటర్లు కూడా ఉన్నారు. ఇక ప్రతిపక్ష్ డెమొక్రట్లు కూడా కాశ్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు ఓట్ల తేడాతో కాశ్​ నియామకం జరిగింది.

అధ్యక్షుడు ట్రంప్‌నకు వీరవిధేయుడిగా కాశ్‌కు పేరుంది. పటేల్‌ కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. తండ్రి ఉగాండాలో నియంత. ఈదీ ఆమిన్‌ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్‌ సిటీలో పటేల్‌ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో మియామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.

Last Updated : Feb 21, 2025, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.