Daaku Maharaj OTT : నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సంక్రాంతికి రిలీజై భారీ విజయం దక్కించుకుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.160+ కోట్ల వసూల్ చేసింది. ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం, తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
అవన్నీ రూమర్సే!
అయితే ఓటీటీ రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. థియేటర్లలో పలు భాషల్లో రిలీజైన ఈ సినిమా, ఓటీటీలో మాత్రం తెలుగులోనే రానుందని వార్తలు వచ్చాయి. అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు సంబంధించి పలు సీన్స్ కట్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.
తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ 'డాకు మహారాజ్' స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా నటి ఊర్వశి రౌతేలాకు సంబంధించి ఎలాంటి సీన్స్ కూడా తొలగించలేదు. ఆమె నటించిన అన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్లో ఉన్నాయి. దీంతో ఈ పుకార్లకు తెర పడినట్లైంది.
#DaakuMaharaaj is all set to take over your home screens! 🦁
— Sithara Entertainments (@SitharaEnts) February 16, 2025
Get ready for the MASS STORM on @Netflix, Streaming from 21st FEBRUARY! 🪓🔥#DaakuMaharaajOnNetflix 💥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby @MusicThaman @Vamsi84 @ItsMePragya… pic.twitter.com/RyeMkld4Dp
కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ విలన్ పాత్రలో అదరగొట్టారు. రవికిషన్, దివి, చాందిని చౌదరి, మకరంద్ దేశ్‌పాండే, సచిన్ ఖేడ్కర్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించగా, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు.
అఖండ 2
ప్రస్తుతం బాలయ్య అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అఖండ 2' క్రేజీ బజ్- బాలయ్యకు విలన్‌గా సరైనోడిని దించిన బోయపాటి!
శరవేగంగా 'అఖండ 2' షూటింగ్ - సెట్స్‌లోకి మరో పవర్ఫుల్ స్టార్!