ETV Bharat / state

పెళ్లి మండపంలో విషాదం - కుమార్తె పెళ్లి జరుగుతుండగా తండ్రికి హార్ట్​ ఎటాక్​ - FATHER DIED OF A HEART ATTACK

కామారెడ్డి జిల్లాలో విషాదకర దృశ్యం - కుమార్తె పెళ్లి జరుగుతుండగా తండ్రికి గుండెపోటు - ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి

Daughter Marriage Father Heart Attack
Daughter Marriage Father Heart Attack (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 9:44 AM IST

Daughter Marriage Father Heart Attack : కుమార్తె వివాహం జరుగుతుండగానే అదే మండపంలో తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్​ పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన కుడిక్యాల బాల్​చంద్రం తన కుమార్తె వివాహం శుక్రవారం స్థానిక కల్యాణమండపంలో ఏర్పాటు చేశారు. వివాహ తంతు జరుగుతుండగానే మండపంలో స్పృహతప్పిపడిపోయాడు. ముహూర్తానికి కొన్ని క్షణాలే మిగిలి ఉండటంతో వధువు తల్లి వరుడి కాళ్లు కడిగి ఆ తర్వాత జరగాల్సిన తంతును పూర్తి చేశారు.

వధువు తండ్రిని బంధువులు కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాల్​చంద్రం మరణవార్త విని వివాహానికి వచ్చిన బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసినప్పటికీ ఆ పెళ్లి చూడకకముందే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కామారెడ్డిలో పదోతరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి : ఈనెల 20వ తేదీన కామారెడ్డి జిల్లాలో పదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించి సీపీఆర్​ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన సరే ఆమె బతకలేదు. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని చదువు నిమిత్తం జిల్లాలోని కల్కినగర్​లో పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం పాఠశాలకు కాలినడకన బయలుదేరింది. పాఠశాల సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే పాఠశాల యాజమాన్యం బాలికను స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు సీపీఆర్​ చేసి రక్షించే ప్రయత్నం చేసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తుండగా విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ గుండెపోటు వస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి, కంటి నిండా నిద్ర లేకపోవడం వంటివే హార్ట్​ ఎటాక్​కు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం, రోజుకు 8 గంటల నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి చేస్తే హార్ట్​ ఎటాక్​, ఇంకా మిగిలిన రోగాలు కూడా శరీరం దరి చేరవు.

పాఠశాలకు వెళ్తూ దారిలో కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని - సీపీఆర్​ చేసిన నో ఛాన్స్​

ఆ జిల్లాలో 'గుండెపోటు' వస్తే అంతే సంగతులు - అత్యవసర వేళల్లో ప్రాణాలు కోల్పోతున్న వైనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.