ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​ : ఎట్టకేలకు 'షెడ్డు నుంచి భవనంలోకి' - విద్యార్థుల సమస్యకు చెక్​! - CLASSROOM ARRANGEMENT FOR STUDENTS

భవనం లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనాడు - ఈటీవీ భారత్ కథనం - స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి - రేకుల షెడ్​ నుంచి భవనంలోకి విద్యార్థులు విద్యార్థులకు తరగతి గది ఏర్పాటు

Response On Etv Bharat Story
Response On Etv Bharat Story (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 11:01 AM IST

Classroom Arrangement for Students : భవనం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఈనాడు-ఈటీవీ భారత్​ బుధవారం ప్రచురించిన ప్రత్యేక కథనం అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. విద్యార్థులు చదువుకునేందుకు శాశ్వత భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించింది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం దుబ్బగూడలో కొనసాగుతున్న దాజీనగర్‌ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై "బడి షెడ్డులో సగం- గుడిలో సగం" శీర్షిక ‘ఈనాడు - ఈటీవీ భారత్​లో ప్రచురితమైంది. దీనిపై సీఎం రేవంత్​ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే.

షెడ్డు నుంచి భవనంలోకి విద్యార్థులు : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం గురువారం వరంగల్‌ నుంచి వచ్చిన పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డితోపాటు ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజనల్​ ఆఫీసర్​ వినోద్‌కుమార్, డీఈవో ప్రణీత, ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు సమీపంలో ఉన్న ఓ అద్దె భవనంలోకి పిల్లలను తరలించారు. 3 గదులతో పాటు తాగునీరు, టాయిలెట్​ సౌకర్యాలు ఉండటంతో విద్యార్థులు అందులోకి ఆనందంగా వెళ్లారు. శాశ్వత భవన నిర్మాణంతో పాటు, నెలవారీ అద్దె నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు వివరించారు.

ఇదీ జరిగింది : ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్​ జిల్లాలోని మావల మండలంలోని దుబ్బగూడలో పాఠశాల లేక తడికల షెడ్డులో సగం, దేవుని ఆలయంలో సగం విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడి ప్రైమరీ పాఠశాల గతంలో ఓ అద్దె ఇంట్లో నడిచేది. అప్పుడు 38 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇంటి ఓనర్​ ఖాళీ చేయించారు. ఎక్కడా అద్దె భవనాలు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే చందాల రూపంలో కొంత డబ్బులు వేసుకుని తడికలు, రేకులతో షెడ్డును ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఆ షెడ్డులో 28 మంది విద్యార్థులు ఉన్నారు. షెడ్డులో విద్యార్థులందరూ పట్టకపోవడం వల్ల పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షాల పడితే సెలవు ఇస్తారు. విద్యార్థుల దయనీయ పరిస్థితిపై స్పందించి ఈనాడు-ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై సీఎం రేవంత్​ రెడ్డి స్పందించడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లను చేసింది.

బడి 'షెడ్డులో సగం, గుడిలో సగం' కథనంపై సీఎం రేవంత్‌ స్పందన - ఆ పాఠశాలకు శాశ్వత భవనం ఏర్పాటుకు ఆదేశం

పాఠశాల గోడ దూకి 18 కి.మీ. పాదయాత్ర చేసిన విద్యార్థులు - ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.