ETV Bharat / technology

స్మార్ట్ టీవీ కోసం 'జియోటెలి ఓఎస్‌'- ఇండియా ఓన్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే! - JIO LAUNCHES JIOTELE OS

స్మార్ట్ టీవీ కోసం భారత్​ మొట్టమొదటి ఆపరేటింగ్ సిస్టమ్ లాంఛ్!- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Jio has launched JioTele OS for Smart TVs in India
Jio has Launched JioTele OS for Smart TVs in India (Photo Credit- Jio)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 19, 2025, 8:08 PM IST

Jio Launches JioTele OS: రిలయన్స్ జియో స్మార్ట్ టీవీ కోసం దేశంలో మొట్టమొదటి ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 'జియోటెలి ఓఎస్‌ (JioTele OS)' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్​ స్మార్ట్​ టీవీలకు పెరుగుతున్న డిమాండ్​ను తీరుస్తుందని కంపెనీ తెలిపింది. స్మార్ట్‌టీవీ కంటెంట్‌ను మరింత మందికి చేరువ చేయడం, ప్రాంతీయ కంటెంట్‌ను అందించడమే ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం అని చెబుతోంది.

దీంతోపాటు ఇది టీవీ OEMలు సరసమైన ధరలకు వరల్డ్​-క్లాస్ ఎక్స్​పీరియన్స్​ను అందించడానికి వీలు కల్పిస్తుందని జియో అంటోంది. దీన్ని "ఇండియా ఓన్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్" అని పిలుస్తోంది. అంతేకాక దీన్ని నెక్స్ట్-జనరేషన్ ప్లాట్​ఫారమ్​గా పేర్కొంటూ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాల కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్​ను రూపొందించినట్లు తెలిపింది.

తమ కొత్త 'జియోటెలి OS' Google TV, LG's webOS, Samsungs Tizen ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా నిలుస్తుందని కంపెనీ అంటోంది. ఆపరేటింగ్ సిస్టమ్​ ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది. 'జియోటెలి OS'తో నడిచే టెలివిజన్లు ఫిబ్రవరి 21, 2025 నుంచి థామ్సన్, కోడాక్, BPL, JVC వంటి బ్రాండ్ల నుంచి అందుబాటులోకి రానున్నాయని, ఈ ఏడాది చివర్లో మరిన్ని బ్రాండ్లు ఈ లైనప్‌లో చేరతాయని జియో చెబుతోంది.

భారతదేశంలో డిజిటల్ వినోదానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోందని, ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే 35 మిలియన్ల TV హౌస్​హోల్డ్స్ కనెక్ట్ అయ్యాయని జియో తెలిపింది. టెలివిజన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించడం వెనక గల కారణాన్ని వివరిస్తూ, చాలామంది వినియోగదారులు తమ కనెక్టెడ్ టీవీల లిమిటెడ్ కేపబిలిటీల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారని కంపెనీ తెలిపింది.

ఈ సవాళ్లలో రిస్ట్రిక్టెడ్ కస్టమైజేషన్, హై-క్వాలిటీ ప్రాంతీయ కంటెంట్​కు లిమిటెడ్ యాక్సెస్, సీమ్​లెస్ ఆబ్​సెన్స్, ప్రీమియం యూజర్ ఎక్స్​పీరియన్స్ లేకపోడం వంటివి ఉన్నాయని తెలిపింది. దీంతో ఈ సమస్యలను పరిష్కరించి ​సరసమైన ధరకే ఫాస్ట్ ప్రీమియం, కంటెంట్-రిచ్ స్మార్ట్​ టీవీ ప్లాట్​ఫారమ్​ను అందించి భారతీయ గృహాలను మార్చాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 'జియోటెలి ఓఎస్‌' పేరుతో స్మార్ట్ టీవీ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్​ను తీసుకొచ్చినట్లు జియో తెలిపింది.

'జియోటెల్ OS' ముఖ్యమైన ఫీచర్లు: జియోటెల్ OS ముఖ్యమైన ఫీచర్లలో AI-ఆధారిత కంటెంట్ రికమండేషన్స్ (అంటే ఏఐ సాయంతో ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పర్సనలైజ్డ్‌ కంటెంట్‌ను సిఫార్సు చేస్తుంది), సీమ్​లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ గ్లోబల్ అండ్ రీజినల్ కంటెంట్, TV ఛానల్స్ అండ్ OTT అప్లికేషన్​లకు ఈజీ యాక్సెస్, స్మూత్ అండ్ లాగ్​-ఫ్రీ 4K పెర్ఫార్మెన్స్, క్లౌడ్ గేమింగ్​కు యాక్సెస్ వంటివి ఉన్నాయి. సింగిల్‌ రిమోట్‌తో అన్ని రకాల కంటెంట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. వీటితోపాటు ఈ 'టెలివిజన్ OS' కొత్త యాప్‌లు, టెక్నాలజీలు, కంటెంట్ ఫార్మాట్‌లు, అభివృద్ధి చెందుతున్న సెక్యూరిటీలతో అనుకూలంగా ఉండటానికి అభివృద్ధి చెందుతూనే ఉంటుందని, క్రమం తప్పకుండా అప్​డేట్​లను అందిపుచ్చుకుంటుందని జియో తెలిపింది.

గ్లోబల్​ మార్కెట్​లోకి మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్- ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్'- ఇకపై AI టెక్నాలజీ మరింత యూజ్​ఫుల్​!

జియో యూజర్లకు గుడ్​న్యూస్- ఆ రీఛార్జ్​ ప్లాన్​తో 'జియోహాట్​స్టార్'​ ఫ్రీ యాక్సెస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.